Share News

YSRCP: విశాఖ ఐటీపై వైసీపీ విషం

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:15 AM

ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా వైసీపీ పద్ధతి మారలేదు. విషప్రచారం చేయడం మానుకోలేదు. కొత్త ప్రభుత్వంపైన, విశాఖపట్నంలో ఐటీ రంగంపైన విషం చిమ్ముతోంది.

YSRCP: విశాఖ ఐటీపై వైసీపీ విషం

  • జగన్‌ రోత పత్రికలో అసత్య రాతలు

  • క్యాప్‌ జెమినీ చెన్నై వెళ్లిపోయిందట

  • కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏనాడూ ముందుకు రాని కంపెనీ

  • అయినా నిస్సిగ్గుగా దుష్ప్రచారం

  • గత ప్రభుత్వంలోనే పరిశ్రమల పరార్‌

  • టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా వైసీపీ పద్ధతి మారలేదు. విషప్రచారం చేయడం మానుకోలేదు. కొత్త ప్రభుత్వంపైన, విశాఖపట్నంలో ఐటీ రంగంపైన విషం చిమ్ముతోంది. జగన్‌ రోత పత్రికలో అసత్య కథనాలు వండివారుస్తూ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టిస్తోంది. ‘క్యాప్‌ జెమినీ’ అనే ఐటీ కంపెనీ విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లిపోయిందని జగన్‌ పత్రిక శనివారం తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఆ కంపెనీ కార్యాలయమే విశాఖపట్నంలో లేదు. అసలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభిస్తానని ఏనాడూ ముందుకు రాలేదు. గత వైసీపీ ప్రభుత్వం గానీ, విశాఖలోనే ఉండే నాటి ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ గానీ ఏనాడూ ఈ విషయం ప్రకటించలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటై నెల కూడా పూర్తికాకముందే టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడి పెట్టుబడిదారులు పారిపోతున్నారని, క్యాప్‌ జెమినీ కూడా ఆ విధంగానే చెన్నై వెళ్లిపోయిందని అసత్య కథనం ప్రచురించింది. టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. ఇంకా వైసీపీ ప్రభుత్వంలోనే పాలకుల దెబ్బకు పెట్టుబడిదారులు ఇటువైపు చూడలేదు. పైగా గత ప్రభుత్వ విధానాలతో విసిగి ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, హెచ్‌ఎ్‌సబీసీ వంటి ఎన్నో కంపెనీలు తరలిపోయాయి.

ఆ మూడు రావాలనుకున్నా...

విశాఖపట్నానికి ఐటీ రంగంలో ఉన్న అనుకూలతలను చూసి టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, క్యాప్‌ జెమినీ సంస్థలు ఇన్ఫోసి్‌సలాగే శాటిలైట్‌ సెంటర్లు పెట్టాలని భావించాయి. గత రెండేళ్లుగా అనువైన భవనాల కోసం వెదుకుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వారికి ఎటువంటి సాయం చేయలేదు. హెచ్‌సీఎల్‌ సంస్థ ఐటీ పార్కులో మిలీనియం టవర్స్‌ పక్కనే ఉన్న ఎక్స్‌టీ గ్లోబల్‌ టెక్నాలజీస్‌ భవనాన్ని ఎంపిక చేసుకుంది. అయితే అది ఎస్‌ఈజెడ్‌ పరిధిలో ఉండడంతో వెనక్కి తగ్గింది. టీసీఎస్‌ ఇంకా భవనం వేటలో ఉంది. క్యాప్‌ జెమినీ కూడా అదే పనిలో ఉంది. అయితే చెన్నైలో చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సెంటర్‌ను 4రోజుల క్రితం 5వేల సీట్లతో విస్తరించేందుకు శంకుస్థాపన చేపట్టింది. దీన్ని పట్టుకొని వైసీపీ క్యాప్‌ జెమినీ చెన్నై వెళ్లిపోయిందంటూ దుష్ప్రచారం ప్రారంభించింది.


Vizag.jpg

అంతా.. బూటకపు ప్రచారం

జగన్‌ ప్రభుత్వం తన పాలనలో ఒక్క కొత్త కంపెనీని కూడా విశాఖపట్నం తీసుకురాలేదు. అయినా ‘బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌’ అనే పేరును వాడుకలోకి తెచ్చి ఐటీని అభివృద్ధిని చేస్తున్నట్టు లేని గొప్పలు ప్రచారం చేసుకున్నారు. గడచిన ఐదేళ్లలో కేవలం రెండే రెండు కంపెనీలు విశాఖలో ఏర్పాటయ్యాయి. అందులో ఒకటి ఇన్ఫోసిస్‌. అది కూడా ప్రభుత్వ పాలసీని చూసో, వారు ఇస్తామన్న రాయితీలకు ఆశపడో రాలేదు. ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న ఆ సంస్థ ఉద్యోగుల కోసం ఒక శాటిలైట్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని విశాఖపట్నాన్ని ఎంచుకుంది. వారికి సరైన భవనం కూడా వైసీసీ ప్రభుత్వం చూపించలేకపోతే వారే సొంతంగా సమకూర్చుకున్నారు. భవిష్యత్తులో దానిని డెవల్‌పమెంట్‌ సెంటర్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఇందులో ఐటీ మంత్రి అమర్‌నాథ్‌ ప్రమేయం ఇసుమంత కూడా లేదు. ఇకపోతే ర్యాండ్‌స్టాడ్‌ పేరుతో మరో కంపెనీ ఇసుకతోట జంక్షన్‌లో ఏర్పాటైంది. ఇది ఐటీ కంపెనీ కాదు. వివిధ సంస్థలకు ఉద్యోగులను సమకూర్చే సంస్థ. ప్రారంభంలో 150 మంది ఉంటే ఇప్పుడు 30 మంది కూడా లేరు. ఈ రెండు తప్ప బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌ గేలానికి ఒక్క కంపెనీ కూడా చిక్కలేదు. కేంద్ర ప్రభుత్వం బీపీఓ సంస్థలకు అమలు చేస్తున్న ఐడీపీఎస్‌ పథకం ఉపయోగించుకొని డబ్ల్యూఎన్‌ఎస్‌, పాత్ర, టెక్‌ మహీంద్ర వంటి సంస్థలు అదనంగా వేయి నుంచి పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.

ఇవన్నీ పాత సంస్థలు. కేంద్రం ఇచ్చిన రాయితీని ఉపయోగించుకొని విస్తరణకు వెళ్లాయి. ఇందులో వైసీపీ ప్రభుత్వం పాత్ర వీసమెత్తు కూడా లేదు. ఇక, వైసీపీ ప్రభుత్వం ఐటీ కంపెనీలకు ఎటువంటి రాయితీలూ ఇవ్వలేదు. ఒక పాలసీని తయారు చేసి అద్భుతం అని ప్రకటించింది. అయితే దానికి ఎలా దరఖాస్తు చేయాలి? ఎవరిని సంప్రదించాలి? వంటి విషయాలను ఐటీ సంస్థలకు తెలియజేయలేదు. దాంతో ఒక్కరూ దరఖాస్తు చేయలేకపోయారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న రాయితీ బకాయిలు రూ.180 కోట్లు ఇదిగో ఇస్తాం... అదిగో ఇస్తాం అంటూ ఐదేళ్లు గడిపేశారు. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే రాయితీలు ఇచ్చుకున్నారు. ఆ పాలసీ కూడా ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి ఐటీ పాలసీ లేదు.

చంద్రబాబు రాకతో జోష్‌

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక లోకేశ్‌ ఐటీ శాఖను తీసుకొని కొత్త పాలసీ రూపకల్పనకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఐటీ శాఖను తీసుకున్నారని ప్రకటించగానే ఐటీ వర్గాల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఐటీ అభివృద్ధిలో తండ్రి చంద్రబాబు నాయుడు బాటలో పనిచేస్తారని ఐటీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. పలు రాష్ట్రాలు, విదేశాల నుంచి విశాఖపట్నంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తూ ఎంక్వయిరీలు కూడా చేస్తున్నారని ఐటాప్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కమిటీ చైర్మన్‌ నారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Jul 07 , 2024 | 10:08 AM