Share News

YS Sharmila: సీఎంను పొగుడుకుంటూనే షాకింగ్ కామెంట్స్ చేసిన షర్మిల..

ABN , Publish Date - Oct 17 , 2024 | 04:01 PM

ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు పథకాల పేరుతో మభ్యపెట్టి.. అధికారం చేపట్టాక ఆ హామీలను అమలు చేయడం లేదన్నారు. గురువారం విజయవాడలో మీడియాతో..

YS Sharmila: సీఎంను పొగుడుకుంటూనే షాకింగ్ కామెంట్స్ చేసిన షర్మిల..
YS Sharmila

అమరావతి, అక్టోబర్ 17: ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు పథకాల పేరుతో మభ్యపెట్టి.. అధికారం చేపట్టాక ఆ హామీలను అమలు చేయడం లేదన్నారు. గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


వైఎస్ షర్మిల కామెంట్స్ యధావిధిగా..

‘నిన్నటి క్యాబినెట్ మీటింగ్‌లో సూపర్ సిక్స్‌లో ఒక్క సిక్స్ గురించి అయినా చర్చిస్తారు. ఒక్కటైనా అమలు చేస్తారని అనుకున్నాం. మహిళలకు శుభవార్త చెప్తారని అనుకున్నాం. ఉచిత సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఈ రెండూ లో బడ్జెట్ స్కీమ్‌లు. వీటిని అమలు చేస్తారని భావించాం. కానీ, ఎక్కడా వాటిని ప్రస్తావించలేదు. బాబు సూపర్ సిక్స్‌లు గాలికి కొట్టుకు పోయాయి. కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయి. కొత్త పరిశ్రమలు వస్తే మంచిదే. పెట్టుబడులు రావాలి. ఉద్యోగాలు రావాలి. రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తామన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జాబ్ ఫస్ట్ అనేది తమ నినాదం అని సీఎం చంద్రబాబు చెప్పారు.’ అని షర్మిల గుర్తు చేశారు.


సందేహం వ్యక్తం చేసిన షర్మిల..

‘మాటలన్నీ బాగానే చెప్పారు. కానీ, ఇక్కడే బిలియన్ డాలర్ల ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇవన్నీ అమలు చేసే చిత్తశుద్ది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా? 2014లో పెద్ద పెద్ద పథకాలు అన్నారు. అమరావతిని సింగపూర్ అన్నారు. 3D గ్రాఫిక్స్ చూపించారు. అప్పుడు చెప్పిన వాటికి, ఇప్పుడు చెప్పిన వాటికి తేడా లేదు. పాత సినిమాకి కొత్త టైటిల్ పెట్టారు. చంద్రబాబు చెప్తుంటే ఈ కథ ఎక్కడో విన్నట్లుంది అనిపించింది. పాత గిఫ్ట్ కొత్త బాక్స్‌లో ఇస్తున్నారు. ఇవి అమలు అవుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.’ అని సందేహం వ్యక్తం చేశారామె.


ఆ నినాదం మంచిదే..

‘సీఎం చంద్రబాబును ఒక విషయంలో స్వాగతిస్తున్నాం. జాబ్ ఫస్ట్ అనే నినాదం మంచిదే. రాష్ట్రంలో నిరుద్యోగం తారా స్థాయిలో ఉంది. ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు. గత 10 ఏళ్లుగా పరిశ్రమలు లేక యువత వలసలు వెళ్ళింది. రాష్ట్రానికి నిరుద్యోగం అతి పెద్ద సమస్య. నిన్న చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు 50 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన బాబు చెప్పినట్లు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే..5 ఏళ్లలో 20 లక్షలు ఇస్తారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితే మిగతా వాళ్ల సంగతి ఏంటి..? ఉద్యోగాలు అని గతంలో మోడీ బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేసింది. 20 కోట్ల ఉద్యోగాలలో మనకు ఎన్ని వచ్చాయి ? ఒక్క ఉద్యోగం ఇవ్వని మోడీకి ఎందుకు చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారు ? రాష్ట్రంలో మీరు ఇచ్చే 20 లక్షలకు తోడు మరో 30 లక్షల ఉద్యోగాలు మోడీ ఇవ్వాలి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు డిమాండ్ చేయాలి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరు కలిసి కూర్చొని ఉద్యోగాల కల్పన పై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి.’ అని షర్మిల డిమాండ్ చేశారు.


ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు..?

‘రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పిందో.. ప్రధాని మోదీ కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలి. గత 10 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది తేల్చాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేయాలి. లోకేష్.. మోదీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారట. 21 మంది ఎంపీలు ఇస్తామని చెప్పి ఇచ్చారట. అయ్యా లోకేష్ గారు.. మీరు ఇచ్చిన మాట సరే.. మోదీ ఇచ్చిన మాట ఏంటి ? రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీలు అందరూ మోదీకి ఊడిగం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో నిలబడి మోదీ చెప్పారు. ఆయన ఇచ్చిన మాట ఎక్కడ పోయింది? హోదా వచ్చి ఉంటే.. పరిశ్రమల కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. పోటీ పడి మరీ పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాఖండ్‌లో 2 వేల పరిశ్రమలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లో దాదాపు 10 వేల పరిశ్రమలు వచ్చాయి. మరి హోదా మీద మోదీ ఇచ్చిన మాట ఎక్కడ పోయింది? పోలవరం నాది భాధ్యత అని మోదీ అన్నారు. అమరావతిని న్యూ ఢిల్లీని మించిన రాజధానిని చేస్తామన్నారు. చేతిలో మట్టి కొట్టి పోయాడు తప్పితే ఒక్క రూపాయి ఇవ్వలేదు. వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు అన్నారు.. ఇవ్వలేదు. విశాఖ స్టీల్‌కి ఒక్క క్యాపిటల్ మైన్ ఇస్తే మోదీకి జరిగే నష్టం ఏముంది..? ఇదే విషయాన్ని ప్రధాని మోదీని మంత్రి లోకేష్ అడగాలి.’ అని షర్మిల డిమాండ్ చేశారు.


సిక్స్ పాలసీలు సరే.. సిక్స్ పథకాలు ఎక్కడ..?

‘సూపర్ సిక్స్ పాలసీలు సరే.. సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడికి పోయాయి. 20 లక్షల ఉద్యోగాలు అని అన్నారు. అంటే నిరుద్యోగ భృతి ఉన్నట్లా ? లేనట్లా ? నిరుద్యోగ భృతి మీద 2014 లోనే మీరు రూ. 2 వేలు ఇస్తాం అన్నారు. ఇప్పుడు రూ. 3 వేలు అంటున్నారు. ఇంత వరకు భృతిపై జాడ లేదు. తల్లికి వందనం నిధుల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద 15 వందలు అన్నారు.. ఏమయ్యింది ? ఉచిత సిలిండర్లకు దసరా అన్నారు.. దీపావళి అన్నారు.. రేపు సంక్రాంతి అంటారేమో.. ఇది చాలా తక్కువ బడ్జెట్ పథకం. ఏడాదికి రూ. 2 వేల నుంచి రూ. 4 వేల కోట్లకు ఖర్చు అయ్యే పథకానికి నిధులు లేవా? ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమయ్యింది ? వైఎస్ జగన్‌కి తెలియదేమో.. హర్యానా ఎన్నికలతో ఏపీనీ ఎలా పోలుస్తారు ? ఏపీలో ప్రజల నాడికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. హర్యానాలో ప్రజల నాడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఏపీలో ఫలితాలు అనుకున్నట్లే వచ్చాయి. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీదరించుకున్నారు. లిక్కర్ విషయంలో జగన్‌కి, చంద్రబాబుకు పెద్దగా తేడా ఏమీ లేదు. జగన్ హయంలో లిక్కర్ మాఫీయా,‌ తాడేపల్లి ప్యాలెస్‌కి లింక్ ఉంది. చంద్రబాబు హయాంలో నియోజకవర్గంలోని తమ్ముళ్ల చేతుల్లోకి మాఫియా ఉంది. ఇద్దరూ దొందూ దొందే. లిక్కర్ విషయంలో మొత్తం మాఫియా రాజ్యమే.’ అంటూ వైఎస్ షర్మిల తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు.


Also Read:

తండ్రి హత్య! 25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం!

అందరి ముందు హీరోలా బిల్డప్ ఇచ్చాడు.. చివరకు..

పోయేది ఎక్కువ.. వచ్చేది తక్కువ

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 17 , 2024 | 04:01 PM