Share News

Viral Video: వందల ఉద్యోగాల కోసం పోటీ పడ్డ వేల మంది.. తొక్కిసలాట

ABN , Publish Date - Jul 17 , 2024 | 11:27 AM

2,216 ఎయిర్‌పోర్టు లోడర్ ఉద్యోగాల కోసం(Airport Loader Jobs) ఎయిర్ ఇండియా(Air India) రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఆ క్రమంలో ఈ పోస్టుల కోసం ఏకంగా 25 వేల మంది కంటే ఎక్కువ రావడం విశేషం. ముంబై(mumbai) కలీనాలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో మంగళవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగింది.

Viral Video: వందల ఉద్యోగాల కోసం పోటీ పడ్డ వేల మంది.. తొక్కిసలాట
Air India walk mumbai

2,216 ఎయిర్‌పోర్టు లోడర్ ఉద్యోగాల కోసం(Airport Loader Jobs) ఎయిర్ ఇండియా(Air India) రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఆ క్రమంలో ఈ పోస్టుల కోసం ఏకంగా 25 వేల మంది కంటే ఎక్కువ రావడం విశేషం. ముంబై(mumbai) కలీనాలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో మంగళవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ క్రమంలో భారీ సంఖ్యలో ఉద్యోగార్ధులు(job seekers) రావడంతో తొక్కిసలాట జరిగింది. వచ్చిన అభ్యర్థులు ఫారమ్ కౌంటర్‌లను చేరుకోవడానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. ఆ క్రమంలో తొక్కసలాట చోటుచేసుకుందని అభ్యర్థులు అన్నారు. దీంతోపాటు ఆహారం, నీరు లేకుండా గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందన్నారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు. ఆ క్రమంలో భారీ జనసమూహాన్ని అదుపు చేసేందుకు ఎయిర్ ఇండియా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


వీరికి జీతం

ఎయిర్‌పోర్ట్ లోడర్‌లు(Airport Loaders) విమానంలో లగేజీని లోడ్ చేయడం, అన్‌లోడ్ చేయడం, బ్యాగేజ్ బెల్ట్‌లు, ర్యాంప్ ట్రాక్టర్‌లను ఆపరేట్ చేయడం వంటి పనులు చేస్తారు. ప్రతి విమానానికి లగేజీ, కార్గో, ఆహార సరఫరాలను నిర్వహించడానికి కనీసం ఐదు లోడర్లు అవసరం ఉంటుంది. అయితే వీరికి జీతం నెలకు రూ. 20 వేల నుంచి 25 వేల వరకు వస్తుంది. ఇక ఓవర్‌టైమ్ అలవెన్సులు కలుపుకుంటే రూ.30 వేల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ సందర్భంగా వందలాది మంది ఉద్యోగార్థులు ఒకరినొకరు తోసుకుంటూ రావడం కనిపిస్తుంది.


నిరుద్యోగం

ఇటివల గుజరాత్‌(gujarat)లోని భరూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్‌లో 10 పోస్టుల కోసం జరిగిన వాక్ ఇన్(walk in) ఇంటర్వ్యూలో వందలాది మంది ఉద్యోగార్థులు ఒకరినొకరు తోసుకున్న ఘటన మరువక ముందే ఇప్పుడు ముంబై మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఈ పోస్టుల కోసం బుల్దానా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రథమేశ్వర్ 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. మరో అభ్యర్థి రాజస్థాన్‌లోని అల్వార్‌ నుంచి ముంబైకి వచ్చారు. ఇలా అనేక మంది పలు ప్రాంతాల నుంచి తక్కువ పోస్టులు ఉన్న ఉద్యోగాల కోసం రావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటన నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం ఏలా ఉందో అర్థమవుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Viral Video: కన్యాదాన్ అసలు ప్రాముఖ్యతను వివరించిన నీతా అంబానీ


Union Budget 2024: బడ్జెట్‌కు ముందు సాంప్రదాయ హల్వా వేడుక.. నోళ్లను తీపి చేసిన ఆర్థిక మంత్రి

For Latest News and Business News click here

Updated Date - Jul 17 , 2024 | 11:31 AM