Budget 2024: బడ్జెట్ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!
ABN , Publish Date - Jul 18 , 2024 | 12:03 PM
కేంద్ర బడ్జెట్ 2024(budget 2024) ప్రవేశపెట్టేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్(stock maket)లో భారీ ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్ని స్టాక్స్ భారీగా పెరగనున్నాయని నిపుణులు తెలిపారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కేంద్ర బడ్జెట్ 2024(budget 2024) ప్రవేశపెట్టేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్(stock maket)లో భారీ ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. ఈ కారణంగా పెట్టుబడిదారులు భారీ లాభాలను ఆర్జించనున్నారు. ఈ క్రమంలో కొన్ని స్టాక్స్ భారీగా పెరగనున్నాయని నిపుణులు తెలిపారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 2024 బడ్జెట్‌లో కేంద్రం ఖర్చులు, గ్రామీణ సవాళ్లు, ప్రతి రంగం అంచనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను ప్రకటిస్తారు.
పునరుత్పాదక ఇంధనం
JM ఫైనాన్షియల్ నివేదిక ప్రకారం అనేక రంగాల స్టాక్‌లు మెరుగైనవిగా ప్రకటించారు. వాటిలో డిఫెన్స్ నుంచి ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ల వరకు అనేక స్టాక్స్ ఉన్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు పవర్, ఎనర్జీ స్టాక్స్ కోసం PFC, REC, IREDAపై ఫోకస్ చేయవచ్చని తెలిపింది. యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం శక్తి, పునరుత్పాదక ఇంధనంపై దృష్టి పెట్టాలని తెలిపింది. విద్యుత్, పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారించిన పథకాలకు రాబోయే బడ్జెట్‌లో మరిన్ని కేటాయింపులు ఉంటాయని అంచనా వేసింది. కొన్ని పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఆయా బ్యాంకింగ్ స్టాక్‌లపై దృష్టి పెట్టాలని అన్నారు.
హౌసింగ్ స్కీమ్స్
రాబోయే బడ్జెట్‌లో గ్రామీణ మార్కెట్‌లో హౌసింగ్ స్కీమ్‌లపై పునరుద్ధరించబడే సూచనల కారణంగా సరసమైన హౌసింగ్ ఫైనాన్స్ దృష్టికి రావచ్చని పేర్కొన్నారు. అంటే గ్రామస్తులకు గృహ రుణాల కోసం పథకాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), కెనరా బ్యాంక్, HDFC బ్యాంక్ లిమిటెడ్, ICICI బ్యాంక్ ప్రయోజనాలను పొందవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ షేర్లలో పెరుగుదల ఉండవచ్చు. దీంతోపాటు రైల్వే షేర్లు కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఈ క్రమంలో IRFC, IRCTC, RVNL, RailTel, Titagarh Rail వంటి స్టాక్స్ పుంజుకునే ఛాన్స్ ఉంది.
ఈ స్టాక్‌లు కూడా
మరోవైపు సిమెంట్ రంగ స్టాక్‌లు కూడా లాభదాయకంగా ఉంటాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్న నేపథ్యంలో ఈ స్టాక్స్ పెరిగే అవకాశముంది. ఇలాంటి క్రమంలో సిమెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించిన స్టాక్‌లకు ప్రయోజనం చేకూరుతుంది. వాటిలో అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, దాల్మియా భారత్, జెకె సిమెంట్, జెకె లక్ష్మి, బిర్లా కార్ప్ వంటి స్టాక్‌లు బడ్జెట్ ప్రకటనల నుంచి ప్రయోజనం పొందవచ్చు. బడ్జెట్‌లో రక్షణ రంగానికి సంబంధించి కూడా కీలక ప్రకటనలు వెలువడే ఛాన్స్ ఉంది. ఆ క్రమంలో HAL, BHEL, BEL వంటి స్టాక్స్ పెరగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
ITR Filing 2024: ఐటీఆర్ ఫైలింగ్.. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇలా ధృవీకరించుకోండి
Budget 2024: బడ్జెట్ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!
రియల్టీలోకి పీఈ పెట్టుబడులు రూ.25,000 కోట్లు
For Latest News and Business News click here