Stock Market Updates: నష్టాలతో మొదలై లాభాల్లోకి దూకిన స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్
ABN , Publish Date - Jul 18 , 2024 | 10:15 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం(జులై 18న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ వీక్లీ గడువు తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ బలహీనతతో మొదలైంది. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 200 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. నిఫ్టీ(nifty) 60 పాయింట్లకు పైగా బలహీనపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం(జులై 18న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ వీక్లీ గడువు తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ బలహీనతతో మొదలైంది. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 200 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. నిఫ్టీ(nifty) 60 పాయింట్లకు పైగా బలహీనపడింది. బ్యాంక్ నిఫ్టీ(bank nifty)లో 150 పాయింట్లకు పైగా నష్టం కనిపించింది. ఈ నేపథ్యంలో 9.50 గంటల నాటికి మార్కెట్లు నష్టాల నుంచి లాభాల్లోకి జారుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 142 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 33, బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్లు లాభపడింది. మార్కెట్‌కు ఐటీ షేర్ల నుంచి మద్దతు లభించింది.
బైబ్యాక్
ఈరోజు ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్(infosys) క్యూ1 ఫలితాలు విడుదల చేయనుంది. దీంతో మార్కెట్‌లో ఐటీ షేర్లలో కదలిక వస్తోంది. దీంతోపాటు పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలిక్యాబ్ ఇండియా, టాటా కమ్యూనికేషన్స్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ వంటి పెద్ద కంపెనీల ఫలితాలు కూడా రానున్నాయి. అరబిందో ఫార్మా టెండర్ ఆఫర్ ద్వారా షేర్లను రూ. 1460 షేరుతో బైబ్యాక్ చేస్తుంది. ఈ కంపెనీ రూ. 750 కోట్ల వరకు బైబ్యాక్ లేదా 0.88% వాటాను ఆమోదించింది.
ఇది కూడా చదవండి:
ITR Filing 2024: ఐటీఆర్ ఫైలింగ్.. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇలా ధృవీకరించుకోండి
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలోనే ప్రస్తుతం బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైస్, టాటా స్టీల్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, LTIMindtree, ONGC, BPCL, SBI లైఫ్ ఇన్సూరెన్స్, TCS సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో 24% తగ్గుదలని నివేదించిన తర్వాత ఏషియన్ పెయింట్స్ షేర్ ధర 4% పైగా పడిపోయింది. కంపెనీ నికర లాభం రూ. 1,550 నుంచి రూ. 1,170 కోట్లుకు తగ్గింది.
HDFC బ్యాంక్ 1.38 మిలియన్ షేర్లు బ్లాక్‌లో వర్తకం చేయబడ్డాయని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రతికూల ధోరణులు, దేశీయంగా పలు అంశాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ITR Filing 2024: ఐటీఆర్ ఫైలింగ్.. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇలా ధృవీకరించుకోండి
Budget 2024: బడ్జెట్ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!
రియల్టీలోకి పీఈ పెట్టుబడులు రూ.25,000 కోట్లు
For Latest News and Business News click here