Share News

Gold and Silver Rates: తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 23 , 2024 | 08:59 AM

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Gold and Silver Rates: తగ్గిన బంగారం ధర..  తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rates

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర కొంత తగ్గుదల కొనిపిస్తే వెంటనే కొనుగోలు చేయడం చేస్తుంటారు. మరి ఈరోజు (23 మే 2024) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.


బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి.

ఓఎన్‌జీసీ లాభం 19 రెట్లు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే మే 22 బుధవారం ధరతో పోలిస్తే గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గింది. గ్రాము బంగారం ధర రూ.6,829గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.68,290గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 7,450గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.74,500గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.


ఢిల్లీలో..

దేశ రాజధాని ఢిల్లీలో 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి బుధవారంతో పోలిస్తే గురువారం గ్రాముకు రూపాయి తగ్గింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,844గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.68,440గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.7,465గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.74,650గా ఉంది.


ముంబైలో..

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.6,829గా ఉంది. అదే పది గ్రాముల బంగారం ధర రూ.68,290గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,450గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.74,500గా ఉంది.


చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,859గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.68,590గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గ్రాము ధర రూ.7,483కు చేరుకోగా, పది గ్రాముల బంగారం ధర రూ.74,830గా ఉంది.


దేశంలో వెండి ధరలు

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు చూస్తే.. బుధవారంతో పోలిస్తే గురువారం స్వల్పంగా ధర పెరిగింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలో రూ.95,900గా ఉంది.


Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెచ్చు తగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి ఉండొచ్చు.


5 లక్షల కోట్ల డాలర్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Business News and Telugu News

Updated Date - May 23 , 2024 | 08:59 AM