CIBIL Score: ఈ చిట్కాలతో మీ CIBIL స్కోర్ పెంచుకోండిలా
ABN , Publish Date - May 05 , 2024 | 09:49 AM
ప్రస్తుత రోజుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా దాదాపు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో రుణాలు తీసుకుంటారు. అయితే లోన్ తీసుకున్న తర్వాత మళ్లీ మరేదైనా లోన్ తీసుకోవాలంటే కస్టమర్లు మంచి CIBIL స్కోర్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీ CIBIL స్కోర్ 750 కంటే తక్కువ ఉంటే, మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
ప్రస్తుత రోజుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా దాదాపు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో రుణాలు తీసుకుంటారు. అయితే లోన్ తీసుకున్న తర్వాత మళ్లీ మరేదైనా లోన్ తీసుకోవాలంటే కస్టమర్లు మంచి CIBIL స్కోర్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీ CIBIL స్కోర్ 750 కంటే తక్కువ ఉంటే, మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్(credit card) పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే కొంత మంది వారికి తెలియని తప్పులు చేసి CIBIL తగ్గించుకునేందుకు కారకులవుతారు. అయితే ఆ చిన్న చిన్న పొరపాట్లు ఏంటి, CIBIL స్కోర్ పెంచుకునేందుకు ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
సకాలంలో చెల్లింపులు
మీ సిబిల్ స్కోర్ పేలవంగా ఉండటానికి అతిపెద్ద కారణాలలో ఒకటి రుణ బకాయిల చెల్లింపులో జాప్యం చేయడం. మీ వద్ద డబ్బు ఉంటే తప్పనిసరిగా గడువులోగా చెల్లింపులు చేయండి. గడువు తేదీ మార్చిపోతే ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకోవడం ద్వారా కూడా ప్రతి నెల పేమెంట్స్ చేసుకోవచ్చు. సకాలంలో చెల్లింపులు చేస్తే మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది.
క్రెడిట్ రిపోర్ట్ లోపాలు
మీరు మీ రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించినప్పటికీ, అడ్మినిస్ట్రేటివ్ లోపాల కారణంగా మీ లోన్ ఇంకా యాక్టివ్‌గా ఉంటుంది. దీంతో అది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. ఆ క్రమంలో మీ పాత లోన్స్ క్లోజ్ విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి క్లియర్ చేసుకుంటే సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చు.
పాత బాకీ ఉంచవద్దు
మీరు మీ CIBIL స్కోర్‌ని మెరుగుపరచాలనుకుంటే మీ క్రెడిట్ కార్డ్ పాత బకాయి మొత్తాన్ని నిర్ణీత తేదీ కంటే ముందే చెల్లించండి. అది మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
లోన్ గ్యారెంటర్‌గా మారడం
మీరు జాయింట్ అకౌంట్ హోల్డర్ లేదా లోన్ గ్యారెంటర్ అయితే, దీన్ని నివారించండి. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా లోన్ చెల్లించకున్నా కూడా అది నేరుగా మీ CIBIL స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.
రుణాలు తీసుకోవద్దు
మీ అవసరాన్ని బట్టి ఒకేసారి ఒక రుణాన్ని మాత్రమే తీసుకోండి. సకాలంలో తిరిగి చెల్లించండి. పరమితికి మించి రుణాలు తీసుకోవడం ద్వారా బకాయి చెల్లింపులో జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.
దీర్ఘకాలిక రుణం
మీరు లోన్ తీసుకునేటప్పుడు దీర్ఘకాలిక రుణాన్ని ఎంచుకుంటే EMI తక్కువగా ఉంటుంది. దాని చెల్లింపు కూడా సులభం అవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు డిఫాల్టర్‌గా ఉండకుండా ఉంటారు. సకాలంలో చెల్లింపు మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి:
IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest Business News and Telugu News