Share News

LPG Cylinder Price: సిలిండర్ ధరలో ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

ABN , Publish Date - Aug 01 , 2024 | 09:41 AM

బ్యాడ్ న్యూస్. కమర్షియల్ సిలిండర్ ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల సిలిండర్‌పై రూ.8.50 వరకు పెంచుతున్నామని ప్రకటించాయి. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని వివరించింది. సబ్సిడీ సిలిండర్ ధరలో యథాతథంగా ఉంటాయని వెల్లడించాయి.

 LPG Cylinder Price:  సిలిండర్ ధరలో ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?
LPG Cylinder Price Hike

ఢిల్లీ: బ్యాడ్ న్యూస్. కమర్షియల్ సిలిండర్ ధర (LPG Cylinder Price Hike) పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల సిలిండర్‌పై రూ.8.50 వరకు పెంచుతున్నామని ప్రకటించాయి. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని వివరించింది. సబ్సిడీ సిలిండర్ ధరలో యథాతథంగా ఉంటాయని వెల్లడించాయి.


cylinder-2.jpg

రూ.8.50 పెంపు

ధర పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1652.50కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లో రూ.6.50 పెరిగి రూ.1646కి చేరింది. కోల్ కతాలో రూ.8.50 పెరిగి రూ.1764.50 వద్ద ఉంది. ముంబైలో రూ.1605, చెన్నైలో రూ.1817గా ఉంది. జూలై 1వ తేదీన 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.30 తగ్గించిన సంగతి తెలిసిందే. సరిగ్గా నెలరోజులకు ఆ సిలిండర్ ధరను స్వల్పంగా పెంచాయి.


నగరం

కొత్త ధర

పాత ధర

ఢిల్లీ

1652.50

1646

ముంబై

1605

1598


నగరం

కొత్త ధర

పాత ధర

కోల్ కతా

1764.50

1756

చెన్నై

1817

1809.5


14.2 సిలిండర్ ధర మాత్రం

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. 14.2 సబ్సిడీ లేని సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఆ సిలిండర్ ధర రూ.803గా ఉంది. కోల్ కతాలో రూ.829గా ఉంది. ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది. సబ్సిడీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.


Read More Business News
and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 11:07 AM