RBI: నేడు ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న శక్తికాంత దాస్.. వడ్డీ రేట్లు యథాతధం?
ABN , Publish Date - Jun 07 , 2024 | 09:20 AM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ వడ్డీ రేట్లు మార్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ వడ్డీ రేట్లు మార్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. రెపో రేటును 2028 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 6.5 శాతం వద్దే స్థిరంగా కొనసాగిస్తోంది.
ద్రవ్యోల్బణం ఆందోళనలు ఉన్నప్పటికీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కెనడా తమ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. అయితే, ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతుందని భావిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద, ఇరువైపులా 2 శాతం మార్జిన్‌తో కొనసాగించే బాధ్యతను ప్రభుత్వం ఆర్బీఐకి అప్పగించింది.
ఆర్థిక వృద్ధి..
అధిక రెపో రేటు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక వృద్ధి ఊపందుకోవడం వల్ల RBI రేట్లు తగ్గించకుండా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వసతిని ఉపసంహరించుకోవడంపై సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత వైఖరిని కొనసాగించాలని ఎస్బీఐ సూచించింది. మూడవ త్రైమాసికంలో రెపో రేటు తగ్గింపును ఆర్బీఐ అంచనా వేసింది.
ద్రవ్యోల్బణం అంచనాలు
SBI నివేదిక ప్రకారం.. CPI ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే లో 5 శాతం ఉండి జులై నాటికి 3 శాతానికి తగ్గుతుందని అంచనా. 2024-25 అక్టోబర్ నుంచి చివరి వరకు ద్రవ్యోల్బణం 5 శాతం కంటే తక్కువగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతంగా నమోదైంది.
హౌసింగ్ మార్కెట్‌పై ప్రభావం
రెపో రేటును యథాతథంగా ఉంచడం గృహ కొనుగోలుదారులు గుడ్ న్యూస్ అని, తద్వారా హౌసింగ్ మార్కెట్‌కు మద్దతు లభిస్తుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌ను పెంచేందుకు, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం చాలా కీలకమని అంటున్నారు.
For Latest News and National News click here