Stock Markets: లాభాల నుంచి నష్టాల్లోకి దూకిన స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్
ABN , Publish Date - Nov 28 , 2024 | 10:40 AM
భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీతోపాటు సూచీలు మొత్తం గ్రీన్‌లోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం టాప్ 5 స్టాక్స్ ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) గురువారం (నవంబర్ 28న) ఫ్లాట్ స్టార్ట్‌గా మొదలయ్యాయి. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకుని సూచీలు మొత్తం ఎగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10. 27 గంటల నాటికి సెన్సెక్స్ 85 పాయింట్లు పెరిగి 80,316 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 41 పాయింట్లు వృద్ధి చెంది 24,315 పరిధికి చేరింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 315 పాయింట్లు పుంజుకుని 52,604 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 494 పాయింట్లు ఎగబాకి 56,761 స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీల్లో కొనుగోళ్లు భారీగా కనిపించాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.
టాప్ 5 స్టాక్స్
ఈ నేపథ్యంలోనే 10.50 గంటల నాటికి ప్రధాన సూచీలు నష్టాల్లోకి దూకాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 611 పాయింట్లు తగ్గగా, నిఫ్టీ 174 పాయింట్లు పడిపోయింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్, M&M, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, SBI, కోల్ ఇండియా, BPCL, అదానీ పోర్ట్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. దీనికి ముందు ఎఫ్‌ఎంసీజీ షేర్లలో మంచి జోరు కనిపించింది. హెచ్‌యూఎల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోల్ ఇండియా నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
హెచ్‌డీఎఫ్‌సీ రికార్డ్
ఇదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) గురువారం ఇంట్రా డే ట్రేడ్‌లలో మొదటిసారిగా రూ. 14 ట్రిలియన్ మార్కును అధిగమించింది. ఈ క్రమంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ స్టాక్ ధర బీఎస్‌ఈలో రికార్డు స్థాయికి చేరుకుంది. పేటీఎమ్ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది, UBS టార్గెట్ రూ. 1,000కి పెరగడంతో 3% పెరిగింది. రంగాలవారీగా నిఫ్టీ మీడియా, రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ సూచీలలో చెప్పుకోదగ్గ లాభాలు వచ్చాయి. కాగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతం క్షీణించింది.
అమెరికన్ మార్కెట్లు
బుధవారం అమెరికన్ మార్కెట్లలో లాభాల బుకింగ్‌లు వరుసగా నాలుగు రోజుల పాటు కొనసాగాయి. ఆ క్రమంలో మొదటిసారిగా 45 వేల స్థాయిని తాకాయి. కానీ నాస్డాక్ 110 పాయింట్లు పడిపోయింది. థాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఈరోజు అమెరికన్ మార్కెట్లు మూసివేయబడతాయి. ఈరోజు గురువారం (నవంబర్ 28) నిఫ్టీ నెలవారీ గడువు ముగుస్తుంది. కమోడిటీ మార్కెట్‌లో బంగారం ధర 25 డాలర్లు పెరిగి 2660 డాలర్లకు చేరుకోగా, వెండి ధర ఒక శాతం పడిపోయింది. క్రూడాయిల్ $72 దగ్గర ఫ్లాట్ అయింది. సరఫరా తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ ధర దాదాపు 6 శాతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More Business News and Latest Telugu News