Rich People: కష్టం, తెలివి, ఐడియాలే కాదు.. రిచ్ అవ్వాలంటే ఈ 12 సూత్రాలు తెలియాలి
ABN , Publish Date - Dec 13 , 2024 | 01:31 PM
Rich People: డబ్బులు సంపాదించాలనే కోరిక ఉండని వారు ఎవరుంటారు చెప్పండి. దాదాపుగా ప్రతిదీ మనీతో ముడిపడినది కావడంతో దాని వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రిచ్ అవ్వాలంటే కష్టం, తెలివి, ఐడియాలే ఉంటే సరిపోదు.. ఈ 12 సూత్రాలు కూడా తెలియాలి.
డబ్బులు సంపాదించాలనే కోరిక ఉండని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రస్తుత కాలంలో దాదాపుగా ప్రతిదీ మనీతో ముడిపడినది కావడంతో దాని వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని కార్ల్ మార్క్స్ లాంటి తత్వవేత్తలు ఊరికే చెప్పలేదు కదా! కష్టపడితే రిచ్ అవ్వడం ఈజీనే అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మంచి ఐడియాస్, తెవిలితేటలు, కాలంతో పోటీపడుతూ వెళ్లగలిగే సామర్థ్యం, ఎప్పటికప్పుడు మెరుగుపడే తత్వం లాంటివి ఉంటే ఎవ్వరైనా కుబేరులు అయిపోవచ్చని చెబుతున్నారు. అయితే కష్టం, తెలివితేటలు, ఐడియాలే కాదు.. రిచ్ అవ్వాలంటే ఈ 12 సూత్రాలు కూడా తెలియాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
జీవితంలో మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటికి మనం కృతజ్ఞుతులై ఉండాలి. ఉన్నవాటిని ఆస్వాదిస్తూనే నెక్స్ట్ ఏం కావాలని కోరుకుంటున్నామో వాటిపై దృష్టి పెట్టాలి.
కొంతమంది డబ్బులు ఉన్నా ఖర్చు చేసేందుకు వెనుకాడతారు. అయితే మనీ ఒక ఎనర్జీ లాంటిదని గుర్తించాలి. దాని విషయంలో పిసినారిగా వ్యవహరించొద్దు.
అవసరమైన సందర్భాల్లో డబ్బును ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మనీ ఖర్చు చేసినా, ఇతరుల నుంచి పొందినా అది కొన్ని గుర్తుండిపోయే అనుభూతులను ఇస్తుందని చెబుతున్నారు.
ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి. పాజిటివిటీ లైఫ్‌లో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది.
డబ్బు సంపాదనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. లెక్కలేనంత మనీ ఉంది. అయితే అది నీ దగ్గర రావాలంటే ఓపిక, సహనాన్ని అలవర్చుకోవాలి. నిండు మనసుతో దాన్ని స్వాగతించాలి.
మీరు కోటీశ్వరులు అయ్యేందుకు అర్హులు, డబ్బులు సంపాదించగలరు, ఆ శక్తిసామర్థ్యాలు మీకు ఉన్నాయని నమ్మండి. అది డబ్బుల రాకకు మరింత తోడ్పడుతుంది.
మనీ విషయంలో మీ టార్గెట్ రీచ్ అయ్యే క్రమంలో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. ఒక్కొక్కటి సాధిస్తూ పోతుంటే వచ్చే కిక్కే వేరు. అది మీ బిగ్ గోల్‌ను చేరుకునేందుకు ఉపయోగపడుతుంది.
మనీ ఉన్నప్పుడు ఇతరులకు గిఫ్ట్‌లు లాంటివి ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుండాలని నిపుణులు అంటున్నారు. డబ్బుల కోసం మరీ పరితపించకుండా మీకు అవసరం ఉంటే అదే చెంతకు వస్తుందని గుర్తు పెట్టుకోండి.
అవసరం ఉన్నవారికి డబ్బులు ఇవ్వాలి. మనీ విలువ పెంచితే మన సంపద కూడా పెరుగుతుందని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
మీ జీవితంలో పెట్టుకున్న లక్ష్యాలు పెద్దవైతే, వాటి కోసం మీరు పడుతున్న శ్రమలో నిజాయితీ ఉంటే డబ్బు దానంతట అదే మీ దగ్గరకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మీరు పెట్టుకున్న గోల్స్ పెద్దవైతే డబ్బుల సంపాదన దిశగా అవే మిమ్మల్ని నడిపిస్తాయి. మనీ ఉందని అడ్డగోలుగా ఖర్చు చేయకూడదు. దానికి గౌరవం ఇస్తూ జాగ్రత్తగా వాడుకోవాలి.
Also Read:
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. సూచీల పతనానికి కారణమిదే..
తగ్గేదేలే అంటున్న పసిడి.. వామ్మో.. ఇంత పెరిగిందేంటి
రష్యాతో రిలయన్స్ భారీ డీల్ !
For More Business And Telugu News