WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఎంటంటే..?
ABN , Publish Date - Apr 23 , 2024 | 06:27 PM
వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ ఫ్రెండ్లీగా రూపొందిస్తోంది. త్వరలో మరో ఫీచర్ రాబోతుంది. ఇకపై మొబైల్‌లో నెట్ లేకున్నా వాట్సాప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృసంస్థ మెటా వెల్లడించింది.
వాట్సాప్ (WhatsApp) కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. త్వరలో మరో ఫీచర్ రాబోతుంది. ఇకపై మొబైల్‌లో నెట్ లేకున్నా వాట్సాప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృసంస్థ మెటా ధృవీకరించింది.
Business Idea: ఉద్యోగం వదిలి పశుపోషణ.. నెలకు లక్షకుపైగా ఆదాయం
ఇంటర్నెట్ లేకుండా బ్లూ టూత్, షేర్ ఇట్, నియర్ బై షేర్ యాప్స్ ద్వారా ఫొటోలు, సినిమాలు పంపించే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆ తరహా సేవలను వాట్సాప్ అందుబాటులోకి తేనుంది. ఫీచర్ ఎనేబుల్ చేయాలంటే వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫొటో గ్యాలరీ యాక్సెస్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఫైల్ పంపించే వ్యక్తి మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ అయ్యేంత దగ్గరలో ఉంటే షేరింగ్ వీలవుతుంది. లేదంటే ఫైల్ సెండ్ కాదు. అవతలి వ్యక్తి బ్లూ టూత్ ఆన్ చేసి, అనుమతి ఇస్తే షేరింగ్ జరుగుతుంది. వద్దు అనుకుంటే ఆఫ్ చేసే సదుపాయం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు టెస్టింగ్ దశలో ఉంది.
మరో ఫీచర్ కూడా వాట్సాప్‌లో అందుబాటులోకి రానుంది. చాట్ లిస్ట్‌లో ఫేవరెట్స్ ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకురానుంది. మీకు ఇష్టమైన వ్యక్తులను ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ చాట్ చేసే వారు, నచ్చిన వాళ్ల కోసం కాంటాక్ట్స్ వెతకాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ కూడా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో బీటా యూజర్లకు అందుబాటులోకి రానుంది.
Business Idea: ఉద్యోగం వదిలి పశుపోషణ.. నెలకు లక్షకుపైగా ఆదాయం
Read Latest Business News or Telugu News