Business Idea: ఉద్యోగం వదిలి పశుపోషణ.. నెలకు లక్షకుపైగా ఆదాయం
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:54 AM
భారతదేశంలో పశుపోషణ వ్యాపారానికి రోజురోజుకు ప్రాచుర్యం పెరుగుతోంది. దీంతో రైతులతో పాటు విద్యావంతులు కూడా తమ ఉద్యోగాలను వదిలి అదనపు ఆదాయం కోసం పశుపోషణను చేపడుతున్నారు. ఇందులో మేకల(Goats) పెంపకం అత్యంత డిమాండ్ ఉన్న వ్యాపారమని చెప్పవచ్చు. అయితే ఈ వ్యాపారం ద్వారా తక్కువ ఖర్చుతో మూడు నుంచి నాలుగు రెట్లు ఆదాయం పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చుద్దాం.
భారతదేశంలో పశుపోషణ వ్యాపారానికి రోజురోజుకు ప్రాచుర్యం పెరుగుతోంది. దీంతో రైతులతో పాటు విద్యావంతులు కూడా తమ ఉద్యోగాలను వదిలి అదనపు ఆదాయం కోసం పశుపోషణను చేపడుతున్నారు. ఇందులో మేకల(Goats) పెంపకం అత్యంత డిమాండ్ ఉన్న వ్యాపారమని చెప్పవచ్చు. ఈ వ్యాపారం ద్వారా పాల నుంచి మొదలుకుని మాంసం వరకు ప్రతిదీ అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం కూడా చాలా సులభం. మీరు ప్రభుత్వ సహాయంతో కూడా దీన్ని ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలో మేకల పెంపకం ద్వారా తక్కువ ఖర్చుతో మూడు నుంచి నాలుగు రెట్లు ఆదాయం పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చుద్దాం.
సాధారణంగా మేక పాలకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. దీంతోపాటు ప్రజలు(people) దాని మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. దీని కారణంగా వీటికి మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. దీని ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రైతులకు సబ్సిడీని అందిస్తోంది. భారత ప్రభుత్వం పశుపోషణపై 75% వరకు సబ్సిడీని ఇస్తోంది. వ్యాపారం ప్రారంభించడానికి మీ వద్ద డబ్బు లేకపోయినా, మీరు బ్యాంకు నుంచి రుణం(loan) తీసుకోవచ్చు. పశువుల పెంపకానికి నాబార్డు రుణం అందజేస్తోంది.
దీన్ని ప్రారంభించడానికి కొంత స్థలం, ఆహారం, మంచినీరు వంటివి ఉండాలి. దీంతోపాటు వెటర్నరీ సహాయం, మార్కెట్ వంటివి అందుబాటులో ఉండాలి. ముందుగా మీరు 10 చిన్న ఆడ మేకలను తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వాటికి 50 వేలలోపు ఖర్చు అవుతుంది. దీంతోపాటు వాటికి పచ్చి మేత వంటి ఆహారం కోసం నెలకు 20 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత సాధారణ పరిమాణంలో ఉండే మేకకు 145 నుంచి 155 రోజుల గర్భధారణ కాలం ఉంటుంది. అంటే సగటు సమయం 150 రోజులు.
వాటి నుంచి జన్మించిన వాటిని మళ్లీ పెంచడం ద్వారా మరిన్ని మేకలను(goats) పెంచుకోవచ్చు. బరువును బట్టి సాధారణంగా 5 నుంచి 10 నెలలకు పరిపక్వం చెందుతాయి. ఆ క్రమంలో వాటిని మార్కెట్లో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. మార్కెట్లో సగటున ఒక మేక 10 వేల రూపాయల వరకు ఉంటుంది. బరువును బట్టి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. వీటిని పెంచే క్రమంలో మేక పాలు, మేక ఎరువును కూడా అమ్ముకునే ఛాన్స్ ఉంది. లేదంటే మాంసం వ్యాపారం చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం మేక మాంసం కిలోకు రూ.700కుపైగా పలుకుతోంది.
ఇది కూడా చదవండి:
IMD: దేశంలో మరో 5 రోజులు మండే ఎండలు..ఈ ప్రాంతాలకు అలర్ట్
CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం
Read Latest Business News and Telugu News