Share News

Zomato: జోమాటో నుంచి కొత్త ఫీచర్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు

ABN , Publish Date - May 17 , 2024 | 06:34 PM

మీరు ఎక్కువగా జోమాటో(Zomato) నుంచి ఫుడ్(food) ఆర్డర్ చేస్తారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు ఈ యాప్‌లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయా వంటకాలను సూచిస్తుంది.

 Zomato: జోమాటో నుంచి కొత్త ఫీచర్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు
Zomato healthier food selection choices feature

మీరు ఎక్కువగా జోమాటో(Zomato) నుంచి ఫుడ్(food) ఆర్డర్ చేస్తారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు ఈ యాప్‌లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయా వంటకాలను సూచిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రవేశపెట్టగా వినియోగదారుల నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఫీచర్‌(feature)ని ఇతర వంటకాలు, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.


ఈ విషయాన్ని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ సోషల్ మీడియా(social media) వేదికగా వెల్లడించారు. ఈ ఫీచర్ కింద వినియోగదారులు డిష్‌ను ఆర్డర్ చేసినప్పుడు, వారికి దానితో పాటు ఆరోగ్యకరమైన ఎంపికలు కూడా చూపబడతాయని చెప్పారు. ఉదాహరణకు మీరు బటర్ నాన్‌ రోటీని ఆర్డర్ చేస్తే దానికి బదులుగా తందూరి రోటీని తీసుకోవాలని సిఫార్సు చేస్తుందని తెలిపారు. అదే సమయంలో మీరు ఏదైనా స్వీట్ ఆర్డర్ చేస్తే, తక్కువ కేలరీల స్వీట్లను ఎంచుకోవాలని మీకు ఎంపిక ఇవ్వబడుతుందన్నారు.


మరోవైపు మార్చి 2024లో జొమాటో((Zomato) కొత్తగా ‘ప్యూర్ వెజ్ మోడ్’ ఫీచర్‌ను తీసుకొచ్చి విమర్శలను ఎదుర్కొంది. శాకాహార ఆహారాన్ని పంపిణీ చేసే రైడర్‌లు మాత్రమే ఆకుపచ్చ యూనిఫాం ధరిస్తారని తెలుపడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆ విధానాన్ని రద్దు చేసి కంపెనీ యూనిఫామ్‌ ఆకుపచ్చకు బదులుగా ఎరుపు రంగులోనే ఉంటారని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.


ఇది కూడా చదవండి:

Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

Read Latest Business News and Telugu News

Updated Date - May 17 , 2024 | 06:36 PM