Indian Economy: చైనాకు షాక్, భారత్‌కు గుడ్ న్యూస్..UNO రిపోర్ట్‌లో..
ABN , Publish Date - May 17 , 2024 | 04:51 PM
భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. 2024 నాటికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధిని ఐక్యరాజ్యసమితి సవరించిన సందర్భంగా నిపుణుడు ఈ విషయాన్ని వెల్లడించారు. దీని వల్ల భారతదేశం(bharat) ప్రయోజనం పొందుతోందని భావిస్తున్నట్లు యూఎన్(UN) గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ బ్రాంచ్ అధిపతి హమీద్ రషీద్ అన్నారు.
ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ(Indian Economy) 2024లో 6.9 శాతం, 2025లో 6.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. ఇది ప్రధానంగా బలమైన ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా చేరుకుంటుందని 'గ్లోబల్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ఔట్లుక్ టు మిడ్ 2024' విడుదల చేసిన డేటా పేర్కొంది. బలహీనమైన బాహ్య డిమాండ్ సరుకుల ఎగుమతి వృద్ధిపై ప్రభావం చూపుతూనే ఉన్నప్పటికీ, ఫార్మాస్యూటికల్స్, రసాయనాల ఎగుమతులు బలంగా పెరుగుతాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఐక్యరాజ్యసమితి (UNO) అంచనా వేసిన 6.2 శాతం వృద్ధిరేటు కంటే భారత్ ఆర్థిక వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని తాజా మిడ్ ఇయర్ డేటా అంచనా వేసింది. ఇందులో చైనాకు కూడా స్వల్పంగా పెరిగింది. ఇప్పుడు 2024లో చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా ఉంటుందని తెలుపగా, జనవరిలో 4.7 శాతంగా అంచనా వేశారు. ఇక చైనా వృద్ధి రేటు 2023లో 5.2 శాతం నుంచి 2024లో 4.8 శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు.
ఇది కూడా చదవండి:
Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Read Latest Business News and Telugu News