Encounter: కంకేర్ ఎన్‌కౌంటర్ అప్‌డేట్.. భారీగా ఆయుధాలు, కాల్పుల వీడియో
ABN , Publish Date - Apr 17 , 2024 | 02:51 PM
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని కంకేర్(Kanker district)లో అతిపెద్ద నక్సలైట్ ఎన్‌కౌంటర్(encounter) మంగళవారం జరిగింది. ఇందులో భద్రతా బలగాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయి. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన 29 మందిలో 15 మంది మహిళలు ఉన్నారని బస్తర్ రేంజ్(Bastar Range) ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని కంకేర్(Kanker district)లో అతిపెద్ద నక్సలైట్ ఎన్‌కౌంటర్(encounter) మంగళవారం జరిగింది. ఇందులో భద్రతా బలగాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయి. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో అటవీప్రాంతంలో నక్సలైట్ల(Naxalites)కు ప్రతీకారంగా భద్రతా సిబ్బంది ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన 29 మందిలో 15 మంది మహిళలు ఉన్నారని బస్తర్ రేంజ్(Bastar Range) ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, వారిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారని సుందర్‌రాజ్(Sundarraj) వెల్లడించారు. దీంతోపాటు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిలో సీపీఐ ఉత్తర బస్తర్ డివిజన్‌కు(Bastar Range) చెందిన సీనియర్ కార్యకర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హతమైన నక్సలైట్లను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో మావోయిస్టుల ఉత్తర బస్తర్ డివిజన్‌కు చెందిన డివిజనల్ కమిటీ సభ్యులు శంకర్, లలిత కూడా ఉన్నట్లు సమాచారం. చనిపోయిన నక్సలైట్లలో(Naxalites) శంకర్ సహా పలువురిపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భద్రతా సిబ్బంది, ఒక BSF ఇన్‌స్పెక్టర్, ఒక DRG సైనికుడు, ఒక BSF ఇన్స్పెక్టర్ గాయపడ్డారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని, ఒకరు కోలుకుంటున్నారని అధికారులు అన్నారు. ఈ ఏడాది 71 మంది మావోయిస్టులు హతమయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది సాంధించిన మంచి పురోగతిలో ఇది ఒకటని సుందర్‌రాజ్ అన్నారు.
దీంతో ఈ ప్రాంతానికి, ప్రజలకు కొత్త గుర్తింపును అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సుందర్‌రాజ్ వెల్లడించారు. అయితే ఈ ప్రాంతంలో 50 మంది నక్సలైట్లు ఉన్నారని తమకు మొదట సమాచారం అందిందని, మిగిలిన వారిని పట్టుకునేందుకు సెర్చ్(search) ఆపరేషన్ ప్రారంభించిన క్రమంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని వెల్లడించారు.
ఇది కూడా చూడండి:
Hyderabad: వ్యాధులు నయం చేస్తామని మోసం.. ఆయుర్వేద ఔషధాల ముఠా అరెస్ట్
UAE: ఎడారి నేలలో జలప్రళయం.. భీకర వర్షాలతో వణుకుతున్న దుబాయి
మరిన్ని క్రైం వార్తల కోసం