Cyber Attack: భారత క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం WazirXపై సైబర్ ఎటాక్ విషయంలో కీలక పరిణామం
ABN , Publish Date - Jul 29 , 2024 | 05:49 PM
భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirXపై 10 రోజుల క్రితం సైబర్ ఎటాక్(cyber attack) జరిగింది. ఆ క్రమంలో హ్యాకర్లు $230 మిలియన్ల (రూ.1,925,99,24,000) కంటే ఎక్కువ విలువైన పెట్టుబడిదారుల హోల్డింగ్‌లను లూటీ చేశారు. దీంతో ఈ సంస్థ US ఏజెన్సీ FBIని ఈ దాడి గురించి సంప్రదించగా, ఇందులో ఉత్తర కొరియా సైబర్ నేరస్థులు ఉండవచ్చని తాజాగా ప్రకటించారు.
భారతీయ క్రిప్టో(cryptocurrency) ఎక్స్ఛేంజ్ WazirXపై 10 రోజుల క్రితం సైబర్ ఎటాక్(cyber attack) జరిగింది. ఆ క్రమంలో హ్యాకర్లు $230 మిలియన్ల (రూ.1,925,99,24,000) కంటే ఎక్కువ విలువైన పెట్టుబడిదారుల హోల్డింగ్‌లను లూటీ చేశారు. దీంతో ఈ సంస్థ US ఏజెన్సీ FBIని ఈ దాడి గురించి సంప్రదించగా, ఇందులో ఉత్తర కొరియా సైబర్ నేరస్థులు ఉండవచ్చని తాజాగా ప్రకటించారు. ఈ దాడి వెనుక ఎవరున్నారో కంపెనీ వెల్లడించనప్పటికీ దీని సహ వ్యవస్థాపకుడు నిశ్చల్ శెట్టి ఇది ఉత్తర కొరియా లాజరస్ గ్రూప్ పని అయి ఉంటుందని నమ్ముతున్నట్లు చెప్పారు. జులై 18న WazirX మల్టీసిగ్ వాలెట్‌లలో సైబర్ ఎటాక్ జరుగగా ఎక్స్ఛేంజ్ నుంచి $230 మిలియన్లు లేదా పెట్టుబడిదారుల డబ్బుల్లో 45% కోల్పోయారు.
రికవరీ ప్లాన్
అయితే వినియోగదారుల నిధుల నష్టానికి రికవరీ ప్లాన్‌ను(recovery plan) కూడా ఆలోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రభావాన్ని వినియోగదారులందరికీ సమానంగా పంపిణీ చేయడానికి సామాజిక నష్ట వ్యూహాన్ని ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది. చెప్పాలంటే $230 మిలియన్ల నష్టాన్ని వినియోగదారుల మధ్య విభజించబడుతుంది. మేము ఈ పరిస్థితిని అత్యంత పారదర్శకత, నిజాయితీతో చేయడానికి అంకితభావంతో ఉన్నామని బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. అంటే చాలా మంది పెట్టుబడిదారులు వారి క్రిప్టో ఆస్తులు దొంగిలించబడినా లేదా అనే దానితో సంబంధం లేకుండా వారి హోల్డింగ్‌లలో 55% పొందేందుకు అర్హులుగా ఉంటారు.
వినియోగదారుల కోసం
INR కరెన్సీ చోరీలో భాగం కానందున INRలో నిధులు పెట్టిన పెట్టుబడిదారులు మాత్రమే 100% ఉపసంహరణలకు అర్హులవుతారు. WazirX ఇటీవలి సైబర్ ఎటాక్ తర్వాత వినియోగదారుల కోసం ముఖ్యమైన అంశాలను వివరించింది. క్రిప్టో ఎక్స్ఛేంజ్ నిధుల పంపిణీలో 55 శాతం వినియోగదారు క్రిప్టో ఆస్తులు ట్రేడింగ్ లేదా ఉపసంహరణల కోసం అందుబాటులో ఉంటాయని, ఎంచుకున్న ఎంపికపై ఆధారపడి ఉంటుందన్నారు. మిగిలిన 45 శాతం USDT సమానమైన టోకెన్‌లుగా మార్చబడి లాక్ చేయబడుతుందని పేర్కొంది.
బీమా లేకపోవడం
WazirX రికవరీ ప్లాన్ ప్రకారం వినియోగదారులు ముందుకు సాగడానికి రెండు ఎంపికలను అందిస్తోంది. ఎంపిక A పునరుద్ధరణ ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కస్టమర్‌లు వారి క్రిప్టో ఆస్తులను వర్తకం చేయడానికి, ఉంచుకోవడానికి అనుమతిస్తుంది. కానీ ఉపసంహరణలను పరిమితం చేస్తుంది. ఆప్షన్ B ట్రేడింగ్, ఉపసంహరణలను అనుమతిస్తుంది. అయితే రికవరీ ప్రయత్నాలు ఆప్షన్ Aని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయి. మీరు ఏవైనా లావాదేవీలు లేదా ఉపసంహరణలు చేసే ముందు ఎప్పుడైనా ఆప్షన్ Aకి మారవచ్చని WazirX పేర్కొంది. ఆచరణీయమైన బీమా ఎంపికలు లేకపోవడాన్ని పేర్కొంటూ, సంస్థ కస్టమర్ల నిధులను బీమా చేయలేదని WazirX వ్యవస్థాపకుడు నిశ్చల్ శెట్టి ధృవీకరించారు.
ఇవి కూడా చదవండి:
Hyderabad: హెరాయిన్ సరఫరా చేస్తున్న తండ్రీకుమారుల అరెస్ట్
MS Dhoni: సీఎస్కేకు ధోనీ గుడ్‌బై.. ఆ నలుగురి కోసమే త్యాగం?
Paris Olympics 2024: లక్ష్య సేన్ విజయం డిలీట్.. ఒలింపిక్స్‌లో భారత ఆటగాడికి వింత పరిస్థితి!
Read Latest Crime News and Telugu News