Home » cryptocurrency
ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ(Crypto Currency)తో ప్రపంచవ్యాప్తంగా(wrold wide) అనేక చోట్ల చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిని పలు ప్రాంతాల్లో అధికారికంగా గుర్తించగా, మరికొన్ని చోట్ల మాత్రం నిషేధించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ మాత్రం అధికారికంగా అనుతించలేదు. అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి పెట్టుబడిదారులలో భారీగా ప్రజాదరణ పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirXపై 10 రోజుల క్రితం సైబర్ ఎటాక్(cyber attack) జరిగింది. ఆ క్రమంలో హ్యాకర్లు $230 మిలియన్ల (రూ.1,925,99,24,000) కంటే ఎక్కువ విలువైన పెట్టుబడిదారుల హోల్డింగ్లను లూటీ చేశారు. దీంతో ఈ సంస్థ US ఏజెన్సీ FBIని ఈ దాడి గురించి సంప్రదించగా, ఇందులో ఉత్తర కొరియా సైబర్ నేరస్థులు ఉండవచ్చని తాజాగా ప్రకటించారు.
చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు.. వేలకు లక్షలు.. లక్షలకు కోట్లు సంపాదించొచ్చంటూ వల వేస్తున్నారు కేటుగాళ్లు. అవగాహనలేమితో మోసపోయిన బాధితుల ఉదంతాలు చాలానే వెలుగుచూస్తున్నాయి.