Cyber criminals: పార్ట్‌టైం జాబ్ పేరుతో రూ.2.48 లక్షలకు టోకరా..
ABN , Publish Date - Nov 26 , 2024 | 01:06 PM
పార్ట్‌టైం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని భావించిన ప్రైవేటు ఉద్యోగికి పెట్టుబడి ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ. 2.48 లక్షలు కొల్లగొట్టారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పార్ట్‌టైం ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు.
- రోజు ఆదాయం రూ. 200 నుంచి రూ.2వేల వరకు
- రూ. 1010 డిపాజిట్ చేస్తే రూ.1,500 ఇచ్చారు
హైదరాబాద్ సిటీ: పార్ట్‌టైం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని భావించిన ప్రైవేటు ఉద్యోగికి పెట్టుబడి ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ. 2.48 లక్షలు కొల్లగొట్టారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పార్ట్‌టైం ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు. ఈ సమయంలో సైబర్ నేరగాడు వాట్సాప్(WhatsApp) ద్వారా సంప్రదించాడు. తాను జియోట్టో డిజిటల్ మార్కెటింగ్ సంస్థ హెచ్‌ఆర్‌గా పరిచయం చేసుకున్నాడు. గూగుల్ రివ్యూలు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తే రోజు వారీ జీతం ఇస్తామని చెప్పాడు. ఓ లింక్ ద్వారా గ్రూపులో జాయిన్ చేయించాడు. మొదటి రోజు లింక్‌లను సబ్‌స్రైబ్ చేయించి ఖాతాలో రూ. 200 జమ చేశారు. పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: మణుగూరు ప్యాసింజర్ రైలులో మహిళ హత్య
బాధితుడు రూ.1010 పెట్టుబడి పెట్టి పనిచేస్తే గంటల వ్యవధిలో అతడి ఖాతాలో రూ. 1,500 జమ చేశారు. అదేవిధంగా రూ.3,010 డిపాజిట్ చేసి కొన్ని గంటలు పనిచేస్తే రూ.4,600 ఖాతాలో వేశారు. ఇలా పలుమార్లు చేసి నమ్మకం వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. అతడితో రూ.2,48,693 పెట్టుబడి పెట్టించిన తర్వాత స్పందించడం మానేశారు. దాంతో బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో పాములు
ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్ స్టేడియం
ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..
Read Latest Telangana News and National News