Share News

Cyber ​​criminals: వివరాలివ్వండి.. లోన్‌ తీసుకోండంటూ టోకరా

ABN , Publish Date - Dec 13 , 2024 | 08:10 AM

‘‘వివరాలు ఇవ్వండి.. లోన్‌ తీసుకోండి’’ అంటూ సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ. 1,12,535 కాజేశారు. ఎల్‌బీనగర్‌ ఎస్‌హెచ్‌వో వినోద్‌కుమార్‌(LB Nagar SHO Vinod Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తునికి చెందిన మువ్వల మల్లేశ్వరరావు ఎల్‌బీనగర్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీ వెంచర్‌-2లో నివసిస్తూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

Cyber ​​criminals: వివరాలివ్వండి.. లోన్‌ తీసుకోండంటూ టోకరా

- ప్రైవేట్‌ ఉద్యోగి నుంచి రూ. 1,12,535 కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్: ‘‘వివరాలు ఇవ్వండి.. లోన్‌ తీసుకోండి’’ అంటూ సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ. 1,12,535 కాజేశారు. ఎల్‌బీనగర్‌ ఎస్‌హెచ్‌వో వినోద్‌కుమార్‌(LB Nagar SHO Vinod Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తునికి చెందిన మువ్వల మల్లేశ్వరరావు ఎల్‌బీనగర్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీ వెంచర్‌-2లో నివసిస్తూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల 28న అతడి ఫేస్‌బుక్‌లో ఓ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ. 5 లక్షల లోన్‌ అందుబాటులో ఉందని మెసేజ్‌ ఉండడంతో లింక్‌ ఓపెన్‌ చేసి మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేశాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘మూసీ’లో ఇల్లు పోతుందనే మనోవ్యధతో గుండెపోటు


తర్వాత గుర్తుతెలియని వ్యక్తి కాల్‌ చేసి.. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటే రూ. 5 లక్షల లోన్‌ ఇస్తామని చెప్పాడు. ఫొటో, ఆధార్‌కార్డు, పాన్‌ కార్డు కాఫీలను వాట్సా్‌పలో పంపించాలని సూచించాడు. మల్లేశ్వరరావు(Malleswara Rao)ను నమ్మించడానికి ఫోన్‌ చేసిన వ్యక్తి తన పేరు వేలూరి ప్రతాప్‏రెడ్డి అని పరిచయం చేసుకుని, తన పేరున్న కంపెనీ ఐడీ కార్డును 99488 13397 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా పంపించాడు. కొద్ది నిమిషాల తర్వాత ప్రతాప్‏రెడ్డి అతడికి కాల్‌ చేసి రూ. 3500 ప్రాసెసింగ్‌ ఫీజు మాదబీ దాస్‌ అకౌంట్‌కు పంపించాలని చెప్పాడు.


city4.2.jpg

తర్వాత మరలా కాల్‌ చేసి రూ. 9,878 పంపాలని కోరాడు. లోన్‌ క్రెడిట్‌ అయిన వెంటనే పంపించిన డబ్బు మొత్తం ఖాతాలో జమ అవుతుందని రూ. 68,379 పంపించమన్నాడు. ప్రతాప్‏రెడ్డి సూచించిన పలు అకౌంట్లకు మల్లేశ్వరరావు మొత్తం రూ. 1,12,535 పంపించాడు. లోన్‌ డబ్బు ఖాతాలో క్రెడిట్‌ కాకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు.


ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?

ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్‌

ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 13 , 2024 | 08:10 AM