Cyber criminals: లింకులు పంపి ఖాతాలు ఖల్లాస్
ABN , Publish Date - Nov 23 , 2024 | 07:15 AM
సైబర్ నేరగాళ్లు కొత్తపంథా ప్రారంభించారు. ఖాతాదారులను మభ్యపెట్టి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఇతర వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారుతుండడంతో వేరే మార్గంలో దోచేందుకు యత్నాలు మొదలుపెట్టారు. నిత్య జీవితంలో అత్యంత కీలకంగా మారిన ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారు.
- ఏపీకే ఫైల్స్‌తో మొబైల్ హ్యాక్, సమాచారం లీక్
- వరుసగా వెలుగులోకి వస్తున్న సైబర్ మోసాలు
- కొత్త నంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ తెరవద్దు
- అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌క్రైం పోలీసులు
హైదరాబాద్ సిటీ: సైబర్(Cyber) మోసాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో నేరగాళ్లు కొత్తపంథా ప్రారంభించారు. ఖాతాదారులను మభ్యపెట్టి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఇతర వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారుతుండడంతో వేరే మార్గంలో దోచేందుకు యత్నాలు మొదలుపెట్టారు. నిత్య జీవితంలో అత్యంత కీలకంగా మారిన ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారు. అందులో ఉన్న సమాచారం సేకరించి సునాయాసంగా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కంటి చికిత్సకొస్తే ప్రాణమే పోయింది..
మొబైల్‌ను హ్యాక్ చేయాలంటే ప్రమాదకరమైన మాల్‌వేర్‌తో రూపొందిన యాప్‌ను మొబైల్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఫైల్ ఫార్మాట్)లో ఈ మాల్‌వేర్‌ను పెట్టి టార్గెట్ చేసినవారి మొబైల్స్‌కు పంపుతారు. ఈ లింకును తెరిచి ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న సమయంలో ఇందులో ఉన్న యాప్ ఇన్‌స్టాల్ జరిగి మొబైల్‌లో తిష్ట వేస్తుంది. ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతున్న సమయంలో కాంటాక్ట్స్, గ్యాలరీతోపాటు అన్ని అనుమతులు సెల్ యజమాని ప్రమేయం లేకుండా దానంతట అదే తీసుకుంటుంది.
ఈ యాప్ సాయంతో సైబర్ నేరగాళ్లు మొబైల్‌లో ఉన్న సమచారం, వీడియోలు, ఫొటోలు, బ్యాంకు ఖాతా వివరాలు, మెసేజ్‌లు, వాట్సప్ ఇలా ప్రతి యాప్‌పై నియంత్రణ సాధిస్తారు. ఫోన్‌ను నియంత్రణలో తీసుకొని, కొన్ని సెట్టింగ్స్ మార్చిన, అనంతరం సేకరించినసమాచారం వినియోగించి ఖాతా ఖాళీ చేస్తున్నారు. మరికొంతమంది సైబర్ నేరగాళ్లు ఇందులో ఉన్న సమాచారం, ఫొటోలు వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు.
కూపన్లు, ఆహ్వానాల పేరిట..
సైబర్ నేరగాళ్లు ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయించేందుకు పలురకాల ఎత్తులు వేస్తున్నారు. కొత్తఏడాది, పండగల సీజన్‌లో పలు సంస్థలకు చెందిన ఆఫర్లు, గిఫ్ట్‌కార్డులు, ఆఫర్లు, లాటరీ, ఈ కామర్స్ సైట్ల కూపన్లు అంటూ వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల్లో ఏపీకే లింక్‌లను పోస్ట్ చేస్తున్నారు. ఈ తరహా మోసాల గురించి అవగాహన లేని కొందరు లింకులు క్లిక్ చేస్తుండడంతోపాటు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేస్తున్నారు. నిజమని నమ్మి కొందరు ఏపీకే లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. మరో పద్దతిలో బ్యాంకు అధికారులమంటూ ఫోజులు కొడుతూ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని నమ్మబలుకుతూ లింకులు పంపుతున్నారు.
పోస్టల్ శాఖ అధికారులమంటూ ఫోన్ చేసి మీకు ప్యాకేజీ వచ్చింది లొకేషన్ పంపండంటూ మభ్యపెట్టి, వివరాలు నమోదు చేయమని లింకులు పంపుతున్నారు. మరికొందరు సైబర్ నేరగాళ్లు మరో అడుగు ముందుకు వేసి, ఆహ్వాన పత్రికలు, పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు, ఫంక్షన్లకు సంబంధించిన సమాచారం పంపుతూ వాటితోపాటు లింక్ ద్వారా లొకేషన్ పంపుతున్నారు. కొత్త నంబర్ నుంచి వచ్చినా, శుభకార్యాలకు సంబంధించింది కావడంతో ఫంక్షన్ ఎక్కడ అని ఆరాతీస్తూ లొకేషన్ పేరుతో ఉన్న లింకును ఓపెన్ చేస్తే.. అందులో ఉన్న మాల్‌వేర్ యాప్ మొబైల్‌ను హ్యాక్ చేస్తోంది.
ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!
ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి
Read Latest Telangana News and National News