Cyber criminals: స్టాక్ మార్కెట్ టిప్స్ చెప్తానని రూ.16.25లక్షలు కొట్టేశారు..
ABN , Publish Date - Nov 07 , 2024 | 08:28 AM
స్టాక్ మార్కెట్లో టిప్స్ చెప్తానని.. యువకుడ్ని నమ్మించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) అతడి వద్ద నుంచి రూ.16.25 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు(City Cybercrime Police) ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్ సిటీ: స్టాక్ మార్కెట్లో టిప్స్ చెప్తానని.. యువకుడ్ని నమ్మించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) అతడి వద్ద నుంచి రూ.16.25 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు(City Cybercrime Police) ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన 33 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ‘నేను యాక్సిస్ డైరెక్ట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థలో బిజినెస్ ఎనలిస్టు. స్టాక్ మార్కెట్లో టిప్స్ చెబుతా అతితక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు వస్తాయి’ అని ఆ మేసేజ్‌లో పేర్కొన్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ఎనలిస్ట్ సూచన మేరకు బాధితుడు ముందుగా యాక్సిస్ గ్లోబల్ ప్రో(Axis Global Pro) అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో చేరాడు. ప్రారంభంలో కొద్దిమొత్తంలో ఇన్వెస్టిమెంట్ చేయగా.. మంచి లాభాలు వచ్చాయి. కొద్దిరోజుల్లోనే రూ.16.25లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అనంతరం అతని ఖాతా స్తంభింపజేశారు. ఇదేంటని బాధితుడు ప్రశ్నించగా.. రిటర్న్స్ రిలీజ్ చేయాలంటే వివిధ రకాల పన్ను చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేశారు. ఇదేదో మోసమని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకు కేవైసీ అప్‌డేట్ చేయాలని రూ.1.8లక్షలు..
మరో కేసులో బ్యాంకు కేవైసీ అప్‌డేట్ చేయాలని నగరానికి చెందిన మహిళను నమ్మించిన సైబర్ నేరగాడు ఆమె నుంచి రూ.1.8లక్షలు కొల్లగొట్టాడు. తాను ఐసీఐసీఐ బ్యాంకు రిలేషన్‌షి మేనేజర్‌గా ఆమెతో ఫోన్‌లో పరిచయం చేసుకున్నాడు. ఖాతావివరాలు అప్‌డేట్ చేయాలని నమ్మించాడు. ఐ మొబైల్ యాప్ ఓపెన్ చేస్తే తానే ప్రాసెస్ చేస్తానని చెప్పి ఆమెతో ఇన్‌స్టాల్ చేయించాడు.
జీ మెయిల్ ఐడీ ద్వారా సైబర్ నేరగాడు మొబైల్ యాక్సెస్ పొందాడు. యాప్‌లో నమోదైన బాధితురాలి క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ వివరాలను వినియోగించి, ఓటీపీలు తెలుసుకొని కార్డులో ఉన్న రూ.1.8లక్షలు కొల్లగొట్టాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఆలస్యంగా గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్!
ఈవార్తను కూడా చదవండి: కేశవాపురం వద్దు.. మేఘా కాంట్రాక్టు రద్దు
ఈవార్తను కూడా చదవండి: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఈవార్తను కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News and National News