Share News

Cybercriminals: వామ్మో.. వర్క్‌ ఫ్రం హోం పేరిట రూ.6 లక్షలు లూటీ చేసేశారుగా..

ABN , Publish Date - Jul 13 , 2024 | 12:23 PM

వర్క్‌ ఫ్రం హోం(Work from home) పేరుతో సైబర్‌ నేరగాళ్ల(Cybercriminals) చేతిలో ఓ మహిళ మోసపోయిన ఘటన శుక్రవారం మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండల కేంద్రంలో నివసించే లహరి గృహిణి. కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న రాక్‌ ఫ్రంట్‌ కాలనీలో నివసిస్తుంది.

Cybercriminals: వామ్మో.. వర్క్‌ ఫ్రం హోం పేరిట రూ.6 లక్షలు లూటీ చేసేశారుగా..

కీసర(రంగారెడ్డి): వర్క్‌ ఫ్రం హోం(Work from home) పేరుతో సైబర్‌ నేరగాళ్ల(Cybercriminals) చేతిలో ఓ మహిళ మోసపోయిన ఘటన శుక్రవారం మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండల కేంద్రంలో నివసించే లహరి గృహిణి. కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న రాక్‌ ఫ్రంట్‌ కాలనీలో నివసిస్తుంది. వర్క్‌ ఫ్రం హోం ద్వారా ఆన్‌లైన్‌(Online)లో పనిచేస్తూ సులువుగా డబ్బులు సంపాదించవచ్చనిటెలిగ్రాం గ్రూప్‌ ద్వారా ఈ నెల 4న సైబర్‌ నేరగాళ్లు ఆమెను సంప్రదించారు. వారి మాయమాటలు నమ్మిన ఆమె వారి ఉచ్చులో చిక్కింది. గూగుల్‌స్టార్‌ రేటింగ్స్‌ ఇస్తే, ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేసిన పక్షంలో వెంటనే డబ్బులు చెల్లిస్తామని ఆమెకు ఆశ చూపారు. బ్యాంక్‌ ఖాతా, తదితర వివరాలు తెలియజేయాలని సూచించారు. లహరి తన బ్యాంక్‌ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలను వెలువరించింది.

ఇదికూడా చదవండి: Cyber ​​criminals: బంగారం తాకట్టుపెట్టి సైబర్‌ నేరగాళ్లకు రూ.8.26 లక్షలు సమర్పించారుగా..


వెంటనే ఆమెకు చెప్పిన విధంగా రూ.2,800 చెల్లించారు. టాస్క్‌లను పూర్తి చేయడంతో పాటు పెట్టుబడి పెట్టిన పక్షంలో లక్షల్లో లాభం వస్తుందని ఆశ చూపారు. వారి సూచనల మేరకు ఇచ్చిన టాస్క్‌లను, గేమ్‌లను పూర్తి చేస్తూ పెట్టుబడిగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తూ వచ్చిన ఆమెకు లాభంతో కలిపి తిరిగి ఇస్తూ వచ్చారు. ఇదంతా కూడా టెలిగ్రామ్‌ గ్రూప్‌(Telegram group) ద్వారా చాటింగ్‌ చేస్తూ వ్యవహారాన్ని కొనసాగించారు. మధ్యమధ్యలో నకిలీ సభ్యులను సృష్టించి, వారు లక్షల రూపాయలు పొందినట్లు గ్రూపుల్లో నమ్మబలికారు. ఇదంతా నమ్మిన లహరి తన ఖాతా నుంచి గురువారం రూ.40 వేలు సైబర్‌ మోసగాళ్ల ఖాతాలో వేసింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా వివిధ కారణాలు చెబుతూ విడతల వారీగా అదనంగా రూ.ఆరు లక్షలను వారి ఖాతాలో జమచేయించుకున్నారు. మరో రూ.ఆరు లక్షలు చెల్లించినచో తిరిగి ఒకే సారి రూ.12 లక్షలు చెల్లిస్తామని చెప్పారు. వారి మోసాన్ని గమనించిన లహరి భర్త కిషన్‌ వెంటనే కీసర పోలీసులను ఆశ్రయించగా, సైబర్‌ క్రైం వారికి ఫిర్యాదు చేయాలని సూచించారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 12:23 PM