Share News

Accident: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు

ABN , Publish Date - Jun 21 , 2024 | 11:45 AM

ఈరోజు ఉదయం ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు(bus) ఆకస్మాత్తుగా లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న డ్రైవర్‌, కండక్టర్‌తో సహా నలుగురు చనిపోయారు. వీరిలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Accident: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు
Himachal Pradesh Shimla district accident

ఈరోజు ఉదయం ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు(bus) ఆకస్మాత్తుగా లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న డ్రైవర్‌, కండక్టర్‌తో సహా నలుగురు చనిపోయారు. వీరిలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. అయితే డ్రైవర్, కండక్టర్ కాకుండా బస్సులో ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉండగా, వారిలో ఇద్దరు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని సిమ్లా(Shimla district)లో చోటుచేసుకుంది.


సిమ్లా జిల్లా(Shimla district)లోని రోహ్రు ప్రాంతంలోని కుద్దు నుంచి దిల్తారి నుంచి వెళ్తున్న బస్సు(bus) కొండ రహదారి దిగువన ఉన్న కాలువలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రోహ్రులోని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవర్‌, కండక్టర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతులను నేపాల్‌కు చెందిన కరమ్ దాస్ (డ్రైవర్), రాకేష్ కుమార్ (కండక్టర్), బిర్మా దేవి, ధన్ షాగా గుర్తించారు.

అయితే హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ వర్షం, వాతావరణ సమస్యల కారణంగా ఈ ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.


ఇది కూడా చదవండి:

Hyderabad: ‘రివార్డ్‌’లతో వల.. కూపన్లతో ఖాతాలు ఖల్లాస్‌

Hyderabad: ఎస్‌బీఐ రివార్డు పాయింట్లంటూ.. ప్రభుత్వ ఉద్యోగినికి టోకరా


Read Latest Crime News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 11:53 AM