Jobs Scam: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ..
ABN , Publish Date - Aug 17 , 2024 | 05:55 PM
మాదాపూర్‌లో మరో సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సోసైటీ 100ఫీట్ రోడ్‌లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులను భారీగా మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించారు.
హైదరాబాద్: మాదాపూర్‌లో మరో సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సోసైటీ 100ఫీట్ రోడ్‌లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులను భారీగా మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించారు.
ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసిన కేటుగాళ్లు దాదాపు 600మంది నిరుద్యోగులను రోడ్డుకీడ్చారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఏర్పాటు చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన నిరుద్యోగులు ట్రైనింగ్, జాబ్ కోసం ఒక్కొక్కరు రూ.1.50లక్షలు కట్టారు. కొన్ని రోజులుగా వారికి మాదాపూర్‌లో శిక్షణ ఇస్తున్నట్లు నటించారు. మెుత్తం రూ.10కోట్లు వసూలు కాగానే రాత్రికి రాత్రికి బోర్డు తిప్పేశారు.
ఇవాళ(శనివారం) ఉదయం ట్రైనింగ్ కోసం వెళ్లిన నిరుద్యోగులు తాళాలు వేసి ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పుల తెచ్చి మరీ ఫీజులు చెల్లించామని, మంచి కంపెనీల్లో ప్లేస్మెంట్ ఇస్తామంటూ దారుణంగా మోసం చేశారంటూ బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.