Share News

Hyderabad: 60 మంది.. 20 ముఠాలు.. దాబాల వద్ద ఆగే ట్రావెల్స్‌ బస్సులే లక్ష్యం

ABN , Publish Date - Aug 10 , 2024 | 08:09 AM

ట్రావెల్‌ బస్సులు, దారిదోపిడీలతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న థార్‌ గ్యాంగ్‌(Thar Gang) ఆటను తెలంగాణ పోలీసులు కట్టించారు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు గ్యాంగ్‌లను కటకటాల్లోకి నెట్టారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు చెందిన థార్‌, కంజర్‌ఖేర్వా గ్యాంగ్‌లను అరెస్ట్‌ చేసి రూ. కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.

Hyderabad: 60 మంది.. 20 ముఠాలు.. దాబాల వద్ద ఆగే ట్రావెల్స్‌ బస్సులే లక్ష్యం

- దోపిడీలకు పాల్పడుతున్న థార్‌ గ్యాంగ్‌

- తెలంగాణ పోలీసులకు చిక్కిన రెండు ముఠాలు

హైదరాబాద్‌ సిటీ: ట్రావెల్‌ బస్సులు, దారిదోపిడీలతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న థార్‌ గ్యాంగ్‌(Thar Gang) ఆటను తెలంగాణ పోలీసులు కట్టించారు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు గ్యాంగ్‌లను కటకటాల్లోకి నెట్టారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు చెందిన థార్‌, కంజర్‌ఖేర్వా గ్యాంగ్‌లను అరెస్ట్‌ చేసి రూ. కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు. పట్టుబడ్డ ముఠా సభ్యులను పోలీసుల విచారించిన క్రమంలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. థార్‌ జిల్లా మనావర్‌, కంజర్‌ఖేర్వా ప్రాంతాల నుంచి సుమారు 60 మంది దొంగలు మొత్తం 20 ముఠాలుగా ఏర్పడి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో దోపిడీలకు బయల్దేరినట్లు తేలింది. ఒక్కో ముఠాలో సుమారు ముగ్గురు ఉంటారు. ఒక్కో ముఠా ఒక్కో కారులో బయల్దేరుతుంది.

ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..


ట్రావెల్స్‌ బస్సులే లక్ష్యం..

వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను టార్గెట్‌ చేసే థార్‌ గ్యాంగ్‌(Thar Gang).. శివారు ప్రాంతాల్లోని దాబాలు, పెద్ద హోటళ్లకు కొంచెం దూరంగా కారును నిలుపుతారు. హోటళ్ల వద్ద భోజనానికి ఆగే బస్సులను టార్గెట్‌ చేస్తారు. బస్సులో ఉన్న ప్రయాణికులు డిన్నర్‌కు దిగగానే దర్జాగా ప్రయాణికులు మాదిరిగానే ఒక్కొక్కరు ఒక్కో బస్సులోకి ఎక్కుతారు. ప్రయాణికుల బ్యాగులను శోదిస్తారు. అందులోని ఖరీదైన వస్తువులను దోచేసి తమ బ్యాగుల్లో వేసుకుంటారు. మెరుపు వేగంతో బయటపడతారు. అక్కడ నుంచి చెక్కేసి మరో ప్రాంతానికి చేరుకుంటారు. ఇలా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పదుల సంఖ్యలో బస్సుల్ని దోచుకుంటారు.


city1.2.jpgపగలంతా హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. బస్సుల్లో చోరీలు చేయడం కుదరకపోతే రాత్రి పది తర్వాత శివారు ప్రాంతాల్లోని కాలనీలను, ఖరీదైన ఇళ్లను టార్గెట్‌ చేస్తారు. దొరికినంత దోచుకొని వెళ్లిపోతారు. ఇలా వరుసగా వారం రోజుల పాటు వివిధ రూట్లలో ప్రయాణిస్తూ.. అనువైన చోట దోచుకుంటూ.. వారి కారులో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ధార్‌ జిల్లాకు చేరుకుంటారు. అనంతరం మొత్తం సొత్తును అందరూ సమానంగా పంచుకొని జల్సాలు చేస్తారు. తెలంగాణలో సంచరిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేయడం విశేషం.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 10 , 2024 | 08:09 AM