Share News

Hyderabad: సైబర్‌ కేటుగాళ్ల చేతిలో మోసపోతున్న అమాయకులు

ABN , Publish Date - Oct 22 , 2024 | 10:10 AM

సైబర్‌ నేరగాళ్ల(Cybercriminals) వలలో చిక్కుకొని ఎంతోమంది కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బులు.. కొన్ని నిమిషాల్లోనే ముక్కూమొహం తెలియని మాయగాళ్ల ఖాతాల్లోకి వెళుతున్నాయి. ఏవేవో మాయమాటలు చెప్పి బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న నగదును మొత్తం ఊడ్చేస్తున్నారు.

Hyderabad: సైబర్‌ కేటుగాళ్ల చేతిలో మోసపోతున్న అమాయకులు

- దర్యాప్తు అధికారులమని ఎవరైనా ఫోన్‌ చేస్తే.. 1930 టోల్‌ఫ్రీకి, స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలంటున్న పోలీసులు

హైదరాబాద్: సైబర్‌ నేరగాళ్ల(Cybercriminals) వలలో చిక్కుకొని ఎంతోమంది కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బులు.. కొన్ని నిమిషాల్లోనే ముక్కూమొహం తెలియని మాయగాళ్ల ఖాతాల్లోకి వెళుతున్నాయి. ఏవేవో మాయమాటలు చెప్పి బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న నగదును మొత్తం ఊడ్చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను భయపెట్టి తమ కంట్రోల్‌కు తెచ్చుకుని కీలు బొమ్మలుగా మార్చివేస్తున్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ అయ్యారని భయపెట్టి లక్షలాది రూపాయలను దండుకుంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రూ.55లక్షలతో క్లాక్‌ టవర్‌ నిర్మాణం..


బుధవారం అల్వాల్‌ సూర్యానగర్‌ ప్రాంతానికి చెందిన బాసుపల్లి జైపాల్‌రెడ్డి(35)కి ఈనెల 16వ తేదీన ముంబై క్రైం బ్రాంచ్‌ పేరుతో ఓ వ్యక్తి వాట్సప్‌ వీడియో కాల్‌చేశాడు. సినీ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు సంబంధించిన మనీలాండరింగ్‌ డబ్బులు మీ బ్యాంక్‌ ఖాతాలో జమయ్యిందని, దీనిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదయ్యిందని బెదిరించాడు. నిన్ను డిజిటల్‌ అరెస్ట్‌ చేశామని బెదిరించి అతని బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ. 2.5 లక్షలను ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు.


ఫోన్‌కు లింక్‌ వస్తే జాగ్రత్త

బోయిన్‌పల్లి, యాదవబస్తీ ప్రాంతానికి చెందిన శేఖర్‌(38) అల్వాల్‌ హిల్స్‌ ప్రాంతంలో ఒక సిమెంట్‌ షాపులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన ఆయన ఇంటికి బంధువులు వచ్చారు. ఆ సమయంలో ఒక యాప్‌లో సుచిత్ర మైఫ్రెండ్స్‌ హోటల్లో చికెన్‌ బిర్యాని ఆర్డర్‌ చేశాడు. మొదటి దఫా ఫోన్‌ నుంచి రూ. 241 డెబిట్‌ అయ్యింది. అనుకోకుండా ఫోన్‌ పే ద్వారా బటన్‌ ప్రెస్‌ కావడంతో రెండో సారి కూడా రూ. 271 ఫోన్‌పే నుంచి డెబిట్‌ అయ్యింది. అయితే రెండు సార్లు డబ్బులు కట్‌ అయినప్పటికి శేఖర్‌కు కేవలం ఒక చికెన్‌ బిర్యాని మాత్రమే డెలివరి అయ్యింది.


అదనంగా చెల్లించిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి ఒక స్నేహితుడి సలహా మేరకు బాధితుడు శేఖర్‌ ఆన్‌లైన్‌లో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ చెక్‌ చేసి ఫోన్‌ చేశాడు. సంబంధిత వ్యక్తి శేఖర్‌ ఫోన్‌కు ఒక లింక్‌ పంపాడు. దానిని క్లిక్‌ చేయమని చెప్పడంతో ఫోన్‌కు ఓటీపీ నెంబర్‌ వచ్చింది. ఆ నెంబర్‌ కూడా బాధితుడు సైబర్‌ మోసగాళ్లుకు తెలియజేయడంతో శేఖర్‌ ఎస్‌బీఐ అకౌంట్‌లో ఉన్న రూ. 49,989 డెబిట్‌ అయ్యాయి. దీంతో బాధితుడు అల్వాల్‌ పోలీసులను అశ్రయించాడు.


డిజిటల్‌ అరెస్టులు ఉండవు..

ఎలాంటి నేరాల్లోనైన డిజిటల్‌ అరెస్టులు ఉండవు. ఆ విధంగా ఎవరైనా బెదిరించారంటే మోసం చేసినట్లేనని గుర్తుంచుకోవాలని పోలీసులు పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైన నగదును గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయవద్దు. దర్యాప్తు అధికారులమని ఎవ్వరు ఫోన్‌ చేసినా 1930 టోల్‌ఫ్రీకి, స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.


మోసం చేసే విధానం..

గుర్తుతెలియని వ్యక్తి పోలీస్‌ వేషధారణలో వాట్సా్‌పలో వీడియోకాల్‌ చేస్తాడు. తనకు తాను సీబీఐ లేదా క్రైమ్‌ బ్రాంచ్‌, ఈడీ అధికారిగా పరిచయం చేసుకుంటాడు. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించిన డబ్బు మీ బ్యాంక్‌ ఖాతాలో జమయ్యిందని, మీ పై కేసు నమోదయ్యిందని ఎఫ్‌ఐఆర్‌ కాపీని వాట్సా్‌పకు పంపిస్తాడు. అందులో సదరు బాధితుడికి సంబంధించిన బ్యాంక్‌ పేరు, ఖాతానెంబర్‌, అందులో డబ్బులు జమయినట్లుగా ఉండటంతో బాధితుడు ఒక్కసారిగా భయపడతాడు. తనకు ఆ నేరంతో సంబంధం లేదని బాధితుడు చెబుతున్నప్పటికీ అవతలి వ్యక్తి తనదైన శైలీలో బెదిరిస్తూనే ఉంటాడు. నేరస్థుల ఉచ్చులో పడిపోయిన బాధితులు వారి ఖాతాలో ఉన్న డబ్బును వాళ్లు చెప్పిన బ్యాంక్‌ ఖాతాలోకి జమచేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2024 | 10:10 AM