Hyderabad: మర్డర్ అంటూ సోషల్ మీడియాలో వైరల్...
ABN , Publish Date - Aug 24 , 2024 | 10:54 AM
తెల్లవారుజామున స్థానికులకు రక్తంతో తడిసిన వస్త్రం, చెప్పులు కనిపించాయి. దీంతో ఇక్కడ హత్య జరిగిందంటూ 100కు డయల్ చేశారు. సమాచారం అందుకున్న మధురానగర్(Maduranagar) పోలీసులు విచారణ చేపట్టారు.
- విచారణ చేసిన పోలీసులు
- మద్యం బాటిల్ పగిలి వ్యక్తికి రక్తస్రావమైందని నిర్ధారణ
హైదరాబాద్: తెల్లవారుజామున స్థానికులకు రక్తంతో తడిసిన వస్త్రం, చెప్పులు కనిపించాయి. దీంతో ఇక్కడ హత్య జరిగిందంటూ 100కు డయల్ చేశారు. సమాచారం అందుకున్న మధురానగర్(Maduranagar) పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతలో ఈ విషయం సోషల్ మీడియా(Social media)లో హల్‌చల్ చేసింది. మధురానగర్‌లో మర్డర్.. మృతుడు కనిపించడంలేదని కథనాలు వినిపించాయి. పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్, మధురానగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రెహ్మత్‌నగర్(Rehmatnagar)కు చెందిన వర్షిత్ అలియాస్ సోను(22) మద్యం మత్తులో గురువారం అర్ధరాత్రి 1.30 నుంచి 2గంటల మధ్యలో క్వార్టర్ బాటిల్‌ను తన కుడికాలుతో తన్నాడు.
దీంతో ఆ బాటిల్ పగిలి అతడి కాలు రక్తనాళం కోసుకుపోయింది. విపరీతంగా రక్తస్రావమైంది. ఇది గమనించిన అతడి మిత్రులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వర్షిత్ తల్లి వచ్చి మెరుగైన చికిత్స కోసం అమీర్‌పేట(Ameerpet)లోని వెల్‌నెస్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సోను ఇంట్లో సురక్షితంగా ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియకుండా మర్డర్ అంటూ ప్రచారం చేయడం సరికాదని, సోషల్ మీడియా ఇలాంటి విషయాల్లో సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తను కూడా చదవండి:
Hyderabad: ప్రయాణికుల దృష్టి మళ్లించి చోరీలు..
- ముఠా అరెస్ట్.. రూ. 8.82 లక్షల సొత్తు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: ప్రయాణికుల దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్(Northzone Task Force), బేగంపేట పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ముఠాలో ప్రధాన సూత్రధారి ఢిల్లీ(Delhi)కి చెందిన ఇర్ఫాన్(49) బోరబండకు చెందిన మహ్మద్ ఫిరోజ్(38), ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన షాకీర్(30), భార్య రూబీ (23)తో కలిసి ముఠాను తయారు చేశాడు. వీరు రద్దీగా ఉండే బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌ల వద్ద కాపుకాసి, దృష్టి మళ్లించి ప్రయాణికుల బ్యాగ్‌ల నుంచి నగలు, నగదు తస్కరిస్తున్నారు. ముందుగా చోరీ చేయాలని భావించిన వారిని గుర్తించేవారు. మహ్మద్ ఫిరోజ్(Mohammad Feroze) ఆటోతో ఎదురుచూస్తుండేవాడు. ఆటోలో షాకీర్, రూబీ ప్రయాణికుల్లా కూర్చునేవారు.
టార్గెట్ చేసిన ప్రయాణికుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఇర్ఫాన్ తెలుసుకునేవాడు. షేర్ ఆటో పేరుతో ఫిరోజ్ ఆటో ఎక్కించేవాడు. ఆటోలో ఇరుకుగా ఉందని, బ్యాగ్‌లు సూట్‌కేసులు వెనక పెట్టించేవారు. ప్రయాణికుడి దృష్టి మళ్లించి బ్యాగ్‌లు, సూట్‌కేసుల్లో ఉన్న విలువైన వస్తువులు, నగలు కాజేశారు. అనంతరం ఆటో ఆగిపోయిందని చెప్పి ఫిరోజ్ అందరినీ రోడ్డుపై వదిలేసేవాడు. ఇలా పలువురు ప్రయాణికులను ఈ ముఠా దోచుకుంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 8.82 లక్షల విలువైన బంగారు, వెండి నగలు, ఆటో, మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News