Share News

Hyderabad: స్టాక్‌ మార్కెట్‌లో లాభాలంటూ.. యువకుడిని నమ్మించి..

ABN , Publish Date - Aug 13 , 2024 | 11:35 AM

స్టాక్‌ మార్కెట్లో లాభాలంటూ నగర యువకుడిని నమ్మించిన సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) అతడి నుంచి రూ.5,93,840లను కొల్లగొట్టారు. మోసపోయిన బాధితుడు సోమవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

Hyderabad: స్టాక్‌ మార్కెట్‌లో లాభాలంటూ.. యువకుడిని నమ్మించి..

- రూ.5.93 లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ క్రిమినల్స్‌

హైదరాబాద్‌ సిటీ: స్టాక్‌ మార్కెట్లో లాభాలంటూ నగర యువకుడిని నమ్మించిన సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) అతడి నుంచి రూ.5,93,840లను కొల్లగొట్టారు. మోసపోయిన బాధితుడు సోమవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. డీసీపీ కవిత(DCP Kavita) తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి గుర్తుతెలియని నంబర్‌ నుంచి ‘ఎఫ్‌-20 ఫిడిలిటీ స్టాక్‌ ఇన్వెస్టిమెంట్‌ గైడ్‌’ అనే వాట్సాప్‌ సందేశం వచ్చింది. తాము ఇచ్చే సూచనల ఆధారంగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు అందుకోవచ్చు అంటూ.. నమ్మించారు. అది నమ్మిన యువకుడు వారు చెప్పిన సూచనలు పాటిస్తూ.. స్టాక్‌ మార్కెట్లో వ్యాపారం చేస్తూ కొద్దిమొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు...


ఆ తర్వాత లైన్‌లోకి వచ్చిన కొందరు వ్యక్తులు ఎఫ్‌-20 ఫిడిలిటీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అత్యధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ప్రతిరోజూ రాత్రి 8-9 గంటల మధ్య శిక్షణ తరగతులు నిర్వహించి ఆ తర్వాత ట్రేడింగ్‌లో పాల్గొనేలా చేస్తామన్నారు. అలా నమ్మకాన్ని కలిగించిన నిందితులు ఆ తర్వాత 150 మంది సభ్యులున్న గ్రూపులో యువకడిని యాడ్‌ చేశారు. అలా లాభాలు వస్తున్నట్లు నమ్మించి బాధితుని పేరుతో ఐపీవో షేర్లు కేటాయించారు. అందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో బాధితుడు విరమించుకునే ప్రయత్నం చేయగా ఒప్పుకోలేదు.


150 శాతం లాభాలు వస్తాయని నమ్మించారు. ఆ తర్వాత మంచి లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. ఆ డబ్బును ఉపసంహరించుకోవాలని చూడగా విత్‌డ్రా ఆప్షన్‌క్లోజ్‌ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఐపీవో షేర్లు కేటాయించడానికి మేం చెల్లించన మొత్తంతో పాటు.. వచ్చిన లాభాలపై 10 శాతం కమీషన్‌ చెల్లించాలని మెలికపెట్టారు. దాంతో బాధితుడు విడతలవారీగా రూ. 5,98,840లు చెల్లించాడు. అయినా ఇంకా డబ్బులు చెల్లించాలని ఇబ్బంది పెడుతుండటంతో ఇదేదో మోసంలా ఉందని గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.


...................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.....................................................................

Hyderabad: వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు...

హైదరాబాద్: సోషల్‌ మీడియాలో సినీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేస్తూ ప్రఖ్యాతి పొందిన వేణుస్వామి(Venuswami) ఈ మధ్య జరిగిన అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది. వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌, తెలుగు ఫిల్మ్‌ డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌లు సోమవారం ఎంజీ రోడుల్డో బుద్ధభవన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారద(The chairperson is Criminal Sharada)కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ గతంలో సినిమా రిలీజ్‌లపై, రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అబాసు పాలైనా బుద్ధి రాలేదని, అసలు వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడదు అనే జ్ఞానం కూడా లేని వేణుస్వామి వాళ్లు ఎప్పుడు విడిపోతారో కూడా చెప్పేసాడని అన్నారు.

city5.jpg


ఈ విషయంపై స్పందించిన నేరెళ్ల శారద వేణుస్వామిని పిలిలించి వివరణ అడుగుతామని, ఆయనపై, టెలికాస్ట్‌ చేసిన యూ ట్యాబ్‌ చానల్స్‌పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వై.జె.రాంబాబు, కోశాధికారి సురేంద్ర కుమార్‌ నాయుడు, ప్రసాదం రఘు, లక్ష్మి, తెలుగు ఫిల్మ్‌ డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌ అధ్యక్షురాలు వనం ప్రేమమాలిని, కార్యదర్శి వేదుల మూర్తి, సభ్యులు సువర్ణ, తేజస్విని, భాగ్య లక్ష్మి, కుమార్‌, హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఉపాధ్యక్షులు వనజ పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2024 | 11:35 AM