Hyderabad: గూగుల్‌లో వెతికి.. సైబర్ నేరగాళ్లకు చిక్కి..
ABN , Publish Date - Dec 07 , 2024 | 08:31 AM
నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడు డేటా ఎనలిస్టుగా పనిచేస్తున్నాడు. బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నాడు. ఏదైనా బ్యాంకు కాంటాక్టు నంబర్ దొరుకుందేమోనని గూగుల్(Google)లో వెతికాడు.
- లోన్ ఇప్పిస్తామని మోసం
- యువకుడి నుంచి రూ. 1.10లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
హైదరాబాద్ సిటీ: నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడు డేటా ఎనలిస్టుగా పనిచేస్తున్నాడు. బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నాడు. ఏదైనా బ్యాంకు కాంటాక్టు నంబర్ దొరుకుందేమోనని గూగుల్(Google)లో వెతికాడు. ఈ క్రమంలో అతడికి ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ పేరుతో ఒక నంబర్ దొరికింది. ఆ నంబర్‌కు కాంటాక్ట్ చేశాడు. అవతలి వ్యక్తి తాను ఐసీఐసీఐ(ICICI) ప్రతినిధిగా చెప్పుకున్నాడు. లోన్ మంజూరు చేయాలంటే అందుకు అవసరమైన డాక్యుమెంట్లు పంపాలని సూచించాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పేలుడు
దాంతో బాధితుడు అతడు చెప్పినట్లు కొన్ని డాక్యుమెంట్లు పంపించాడు. మీకు పర్సనల్ లోన్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని, అందుకు అవసరమైన అర్హతలు లేవన్నాడు. బ్యాంకు మేనేజర్ సహకారంతో బ్యాక్ ఎండ్ ద్వారా లోన్ మంజూరు చేయిస్తానని, ప్రాసెస్ ఫీజు చెల్లించాలని రూ. 40 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా బ్యాంకు మేనేజర్ తండ్రి ఆరోగ్యం బాగోలేక మృతి చెందాడని, లోన్ ప్రాసెస్ ఆలస్యం అయిందని, కాస్త ఓపిక పట్టాలని సూచించాడు.
కొద్దిరోజులకు కొత్త మేనేజర్ వచ్చాడని, మళ్లీ ప్రాసెస్ మొదటికి వచ్చిందని, ఆయనకు ఇవ్వాల్సింది ఇస్తే ప్రాసెస్ పూర్తవుతుందని చెప్పాడు. ఇలా దశలవారీగా రూ. 1.10 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు తర్వాత స్పందించడం మానేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి
Read Latest Telangana News and National News