Hyderabad: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
ABN , Publish Date - Nov 22 , 2024 | 07:01 AM
తెలుగు విద్యార్థి ఒకరు అమెరికాలో మృతిచెందాడు. ఆర్యన్‌రెడ్డి అనే విద్యార్థి పుట్టిన రోజు వేడుకలను స్నేహితులతో ఘనంగా జరుపుకున్నాడు. ఈ సమయంలోనే తుపాకీతో రీల్స్ చేసే ప్రయత్నంలో తుపాకీ పేలి చనిపోయాడని తెలిసింది.
హైదరాబాద్: అమెరికాకు చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ ధర్మపురి కాలనీ(Uppal Dharmapuri Colony)కి చెందిన సుదర్శన్‌రెడ్డి కుమారుడు ఆర్యన్‌రెడ్డి(23) ఎంఎస్ చదువుకునేందుకు ఏడాదిన్నర క్రితం అమెరికా(America)లోని జార్జీయా స్టేట్ అట్లాంటాకు వెళ్లారు.
ఈ వార్తను కూడా చదవండి: నదులను కబళిస్తే.. మనుగడే ప్రశ్నార్థకం
ఈనెల 13న ఆర్యన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను స్నేహితులతో ఘనంగా జరుపుకున్నాడు. ఈ సమయంలోనే తుపాకీతో రీల్స్ చేసే ప్రయత్నంలో తుపాకీ పేలి చనిపోయాడని తెలిసింది. ఆర్యన్‌రెడ్డి(Aryan Reddy) మృతదేహం గురువారం రాత్రి వరకు ఉప్పల్‌కు చేరుకుంటుందని మృతుని కుటుంబీకులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య
ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..
ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్
Read Latest Telangana News and National News