Share News

Hyderabad: ‘మీ పేరుతో డ్రగ్స్‌ పార్సిల్‌ దొరికిందంటూ.. క్రైమ్‌ బ్రాంచ్ పోలీసుల్లా..

ABN , Publish Date - Aug 04 , 2024 | 12:07 PM

‘మీ పేరుతో డ్రగ్స్‌(Drugs) పార్సిల్‌ డెలివరీ అయింది. పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయి. పై అధికారులు చెప్పిన విధంగా నడుచుకొని అడిగినంతా డబ్బులు ఇవ్వాలి. లేదంటే అరెస్టు చేస్తామని’ గుర్తుతెలియని వ్యక్తులు క్రైమ్‌ బ్రాంచి పోలీసుల్లా(Crime Branch Police) బెదిరించారు.

Hyderabad: ‘మీ పేరుతో డ్రగ్స్‌ పార్సిల్‌ దొరికిందంటూ.. క్రైమ్‌ బ్రాంచ్ పోలీసుల్లా..

- డబ్బులు ఇవ్వకపోతే అరెస్టు చేస్తాం..

- యువకుడికి సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులు

హైదరాబాద్‌ సిటీ: ‘మీ పేరుతో డ్రగ్స్‌(Drugs) పార్సిల్‌ డెలివరీ అయింది. పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయి. పై అధికారులు చెప్పిన విధంగా నడుచుకొని అడిగినంతా డబ్బులు ఇవ్వాలి. లేదంటే అరెస్టు చేస్తామని’ గుర్తుతెలియని వ్యక్తులు క్రైమ్‌ బ్రాంచి పోలీసుల్లా(Crime Branch Police) బెదిరించారు. అప్రమత్తమైన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన 23 ఏళ్ల యువకుడికి ఇటీవల గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. మీ పేరుతో ఒక పార్సిల్‌ డెలివరీ అయిందని, వివరాల కోసం ఒకటి నొక్కండి అని చెప్పారు.

ఇదికూడా చదవండి: Hyderabad: జీడిమెట్ల పారిశ్రామికవాడలో వ్యక్తి దారుణహత్య...


ఒకటి నొక్కగానే ఓ కొరియర్‌ సర్వీ్‌సకు చెందిన కనెక్టు చేయబడింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. మీ పేరు, ఆధార్‌కార్డును చట్టవ్యరేకమైన డ్రగ్స్‌ పార్సిల్‌ పంపడానికి వినియోగించారని, దాంతో మీపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు(Cyber ​​crime police) కేసు నమోదు చేశారని చెబుతూ కాల్‌ను మరొకరికి బదిలీ చేశారు. క్షణాల్లో మరోవ్యక్తి పోలీస్‌ అధికారిగా నటిస్తూ.. ఈ డ్రగ్‌ పార్సిల్‌కు మీకు ఎలాంటి సంబంధం లేనట్టయితే, వెంటనే ఈ కేసు నుంచి మీ పేరు తొలగించుకోండి. లేదంటే అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. మీ పేరు తొలగించాలంటే ముగ్గురు అధికారులకు చెప్పాల్సి ఉంటుందన్నారు.


అందుకోసం మీరు వెంటనే రూ. 5లక్షలు తాము చెప్పిన ఖాతాలో వేస్తే మీ పేరు తొలగించి కేసు నుంచి తప్పిస్తారని చెప్పారు. లేదంటే ఏ క్షణమైనా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అనుమానం వచ్చిన యువకుడు సిటీసైబర్‌ క్రైమ్‌(CityCybercrime) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా సైబర్‌ క్రిమినల్స్‌ను గుర్తించే పనిలో పడ్డారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 04 , 2024 | 12:07 PM