Share News

Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:56 PM

లండన్‌(London)లో ఉద్యోగం చేస్తూ విధులకు వెళ్తుండగా కూతురును ట్రక్కు ఢీకొట్టింది. కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. లండన్‌ వెళ్లి కన్నకూతురిని చూసేందుకు స్థోమత లేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం లేదా మానవతావాదులు ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..

- లండన్‌ వెళ్లాలి.. సాయం చేయండి

- రోడ్డు ప్రమాదంలో కుమార్తెకు తీవ్రగాయాలు

- కొన ఊపిరితో లండన్‌ ఆస్పత్రిలో..

- చేతిలో చిల్లిగవ్వ లేక తల్లిదండ్రుల తిప్పలు

దిల్‌సుఖ్‌నగర్‌(హైదరాబాద్): లండన్‌(London)లో ఉద్యోగం చేస్తూ విధులకు వెళ్తుండగా కూతురును ట్రక్కు ఢీకొట్టింది. కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. లండన్‌ వెళ్లి కన్నకూతురిని చూసేందుకు స్థోమత లేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం లేదా మానవతావాదులు ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.. వివరాలిలా ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కొడుకు ప్రాణం తీసిన తండ్రి..


city4.2.jpg

ఏపీలోని చీరాలకు చెందిన మురళి, వెంకట రమణమ్మ దంపతులు కొంతకాలం క్రితం నగరానికి వలసొచ్చి చైతన్యపురి డివిజన్‌ మారుతీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె హిమబిందు లండన్‌ వెళ్లి ఎంఎస్‌ చదివి తిరిగి హైదరాబాద్‌(Hyderabad) వచ్చింది. 2015లో విజయవాడకు చెందిన శ్రీనివాసరావుతో వివాహం జరిపించగా, కూతురు జన్మించింది.


ఈ ఏడాది మే నెలలో తిరిగి లండన్‌ వెళ్లి ప్రిస్టన్‌ నగరంలో తమ్ముడి వద్ద ఉంటూ ఓ ఆస్పత్రిలో కేర్‌టేర్‌గా విధులు నిర్వహిస్తోంది. నెలక్రితమే ఆమెకు ఉద్యోగం పర్మినెంట్‌ కావడంతో తల్లిదండ్రులతో సంతోషాన్ని పంచుకుంది. గతనెల 24న హిమబిందు విధులకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. 16 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతుండగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

city4.3.jpg


విమాన ఖర్చులు లేక..

వెంకటరమణమ్మ టైలరింగ్‌, మురళి చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడి పిల్లలిద్దర్నీ ఉన్నత చదువులు చదివించారు. ఆర్థికస్తోమత అంతంతమాత్రమే ఉండడం.. కుమార్తె చావుబతుకుల మధ్య ఉండడంతో లండన్‌ వెళ్లేందుకు విమాన ఖర్చులు లేక విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఆదుకోవాలని, తాము లండన్‌ వెళ్లేందుకు సహాయం చేయాలని దంపతులిద్దరూ వేడుకుంటున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Minister PonnamPrabhakar: సమగ్ర కుటుంబ సర్వేపై ఆందోళన వద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్

ఈవార్తను కూడా చదవండి: KTR: విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్

ఈవార్తను కూడా చదవండి: Caste Census: తెలంగాణలో 243 కులాలు

ఈవార్తను కూడా చదవండి: Tummala: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 10 , 2024 | 12:56 PM