Share News

Hyderabad: మహిళను బెదిరించి రూ. 2.90లక్షలు లూటీ.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Jul 24 , 2024 | 10:52 AM

నగరానికి చెందిన ఓ మహిళను బెదిరించిన సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) రూ. 2.90 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hyderabad: మహిళను బెదిరించి రూ. 2.90లక్షలు లూటీ.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌ సిటీ: నగరానికి చెందిన ఓ మహిళను బెదిరించిన సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) రూ. 2.90 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన మహిళకు ఉద్యోగ అవకాశాల గురించి ఇన్‌స్టాలో ఒక మెసేజ్‌ లింక్‌ వచ్చింది. ఆ లింక్‌ను ఓపెన్‌ చేయగానే ఓటీపీ వచ్చింది. ఆ వెంటనే గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి ‘ఓటీపీ చెప్పండి, మీకు ఉద్యోగాల సమాచారం మొత్తం ఓపెన్‌ అవుతుంది’ అని చెప్పారు. నమ్మిన మహిళ ఓటీపీ చెప్పడంతో సైబర్‌ క్రిమినల్స్‌ ఆమె ఫోన్‌ను హ్యాక్‌ చేశారు. కొద్ది రోజుల తర్వాత మోసగాళ్లు మార్ఫింగ్‌ చేసిన ఆమె నగ్న చిత్రాలను పంపించారు. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు సోషల్‌ మీడియా(Social media)లో పెడతామని, స్నేహితులు, బంధువులకు షేర్‌ చేస్తామని బెదిరించారు. దాంతో కొంత డబ్బును బాధితురాలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది.

ఇదికూడా చదవండి: Hyderabad: రూ.2 లక్షల రుణం ఇస్తామని.. రూ.1.20 లక్షలు కాజేశారు


లక్నో పోలీసులమంటూ..

కొద్దిరోజుల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి లక్నో పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. ‘మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.. మీ ఖాతా నుంచి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని, మీపై అరెస్టు వారెంట్‌ జారీ అయింది’అని భయపెట్టారు. పై అధికారులతో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని హెచ్చరించారు. భయబ్రాంతులకు గురైన మహిళ వారు చెప్పిన ఖాతాలకు రూ. 2.90 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత ఇదంతా సీక్రెట్‌గా ఉంచాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలిసి ఉంటుందని నమ్మించి ఆమె ఫోన్‌లోని వాట్సాప్‌ మెసేజ్‌లన్నీ డిలీట్‌ చేయించారు. వారి ప్రవర్తన, మాట్లాడిన తీరు అనుమానాస్పదంగా ఉండడంతో బాధిత మహిళ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2024 | 10:52 AM