Share News

Hyderabad: బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

ABN , Publish Date - Oct 21 , 2024 | 08:37 AM

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కళాశాలలో ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఇంటి నుంచి కళాశాల చాలా దూరం కావడంతో ఆమెను హాస్టల్‍లో ఉంచి తల్లిదండ్రులు చదివిస్తున్నారు.

Hyderabad: బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

మేడ్చల్: బాచుపల్లి (Bachupally) నారాయణ కాలేజీ (Narayana College)లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంటి నుంచి కళాశాల వసతి గృహానికి తల్లిదండ్రులు తీసుకువెళ్లిన గంటల వ్యవధిలోనే బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరిగి ఇంటికి వెళ్లే లోపే కుమార్తె మరణ వార్త విని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలు అవుతుందనుకున్న కుమార్తె విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించారు. తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచిన బాలిక అనంత లోకాలకు వెళ్లిపోయింది.


సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఇంటి నుంచి కళాశాల చాలా దూరం కావడంతో ఆమెను హాస్టల్‍లో ఉంచి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. వసతి గృహంలో ఉండేందుకు ఇష్టపడని విద్యార్థిని కొన్ని రోజుల క్రితం ఇంటికి వెళ్లింది. అయితే ఆమెకు బాగా చదువుకోవాలని నచ్చజెప్పిన తల్లిదండ్రులు.. బాలిక కాస్త కుదుటపడే వరకూ ఇంట్లోనే ఉంచారు. అనంతరం ఆదివారం సాయంత్రం ఆమెను తిరిగి కళాశాల వద్దకు కారులో తీసుకువచ్చారు. కుమార్తెకు పలు జాగ్రత్తలు చెప్పిన ఆమెను హాస్టల్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయారు.


తల్లిదండ్రులు వెళ్లేటప్పుడు బాలిక వారిని ఆనందంగానే సాగనంపింది. అనంతరం లోపలికి వెళ్లిన బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. అమ్మ, నాన్న తనను అక్కడ వదిలేసి వెళ్లడం ఇష్టం లేని బాలిక క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతిచెందిన విషయాన్ని కళాశాల యాజమాన్యం వెంటనే బాధిత కుటుంబానికి తెలియజేసింది. ఆ సమయానికి మృతురాలి తల్లిదండ్రులు కనీసం ఇంటి వరకూ చేరుకోలేదు. వారు ఫోన్ చేయడంతో వెంటనే కారును వెనక్కి తిప్పి తిరిగి కళాశాల వద్దకు చేరుకున్నారు. కుమార్తె శవంలా పడి ఉండటాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి:

AGroup-1 Exams: గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Telugu University: తెలుగు వర్సిటీ వీసీగా నిత్యానందరావు బాధ్యతల స్వీకరణ

Updated Date - Oct 21 , 2024 | 08:58 AM