WhatsApp Fraud: కొంపముంచిన వాట్సాప్ గ్రూప్.. రూ.9 కోట్లు ఢమాల్.. అసలేమైందంటే?
ABN , Publish Date - Jun 01 , 2024 | 05:52 PM
సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రస్తుతమున్న సాంకేతికతను అడ్డం పెట్టుకొని, మాయమాటలతో అమాయకుల్ని బుట్టలో పడేసి.. భారీ మొత్తంలో డబ్బులు..
సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) మోసాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రస్తుతమున్న సాంకేతికతను అడ్డం పెట్టుకొని, మాయమాటలతో అమాయకుల్ని బుట్టలో పడేసి.. భారీ మొత్తంలో డబ్బులు దోచేసుకుంటున్నారు. మొదట్లో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశపెట్టి, పెట్టుబడి పేరుతో వారి నుంచి డబ్బులు తీసుకొని, చివర్లో శఠగోపం పెట్టి మాయమవుతున్నారు. ఇప్పుడు ఓ వ్యాపారవేత్త కూడా ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి.. ఏకంగా రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది.
Read Also: ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి.. వాటిని ఎలా లెక్కిస్తారు?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రజత్ బోత్రా (Rajat Bothra) అనే వ్యాపారవేత్త మే 1వ తేదీన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో (WhatsApp Group) చేరారు. నిజానికి.. ఆ గ్రూప్‌లో ఆయన స్వయంగా చేరలేదు. తనకు తెలియకుండా ఆ గ్రూప్‌లో ఎవరో చేర్చారు. అందులో షేర్ మార్కెట్ ట్రేడింగ్ (Share Market Trading) ద్వారా లాభాలు ఆర్జించవచ్చని సమాచారం ఉండటంతో.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు. మొదట్లో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. అలా మే 27వ తేదీ నాటికి షేర్ ట్రేడింగ్‌లో రూ.9.09 కోట్ల మేర పెట్టుబడి పెట్టాడు. అయితే.. దాని తర్వాత అతని ట్రేడింగ్ ఖాతా మూసివేయబడింది. దీంతో ఖంగుతిన్న ఆ వ్యాపారవేత్త.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
Read Also: సల్మాన్ ఖాన్ కేసులో షాకింగ్ నిజాలు.. ఏకంగా పాకిస్తాన్ నుంచి..
తమకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే.. వ్యాపారవేత్త బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బులు బదిలీ అవ్వకుండా ఉండేందుకు ఫ్రీజ్ చేశారు. అలాగే.. రూ.1.62 కోట్లు తిరిగి రికవర్ చేయగలిగారు. విచారణలో భాగంగా.. రజత్ అకౌంట్ నుంచి చెన్నై, అస్సాం, భువనేశ్వర్, హర్యానా, రాజస్థాన్‌తో సహా పలు ప్రాంతాల్లో నగదు బదిలీ అయినట్లు తేలింది. ఇందులో ప్రమేయం ఉన్న సైబర్ దుండగులను పట్టుకోవడం కోసం.. ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ రంజన్ రాయ్ తెలిపారు.
Read Latest Crime News and Telugu News