Share News

Shamshabad: బంగారాన్ని కరిగించి, పేస్టుగా మార్చి.. అక్రమంగా తరలిస్తూ..

ABN , Publish Date - Jun 26 , 2024 | 11:37 AM

బంగారాన్ని కరిగించి పేస్టుగా మార్చి.. అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రయాణికుడు అబుదాబి నుంచి మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు.

Shamshabad: బంగారాన్ని కరిగించి, పేస్టుగా మార్చి.. అక్రమంగా తరలిస్తూ..

- రూ.58.8 లక్షల విలువైన 806 గ్రాములు సీజ్‌

హైదరాబాద్: బంగారాన్ని కరిగించి పేస్టుగా మార్చి.. అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రయాణికుడు అబుదాబి నుంచి మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు(Customs officials) బ్యాగులు తనిఖీ చేయగా 806 గ్రాముల బంగారం పట్టుబడింది.

ఇదికూడా చదవండి: Hyderabad: గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల అదుపులో నిందితులు..?


బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేశారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.58.8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని కరిగించి పేస్ట్‌గా మార్చి తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని నగరంలోని కస్టమ్స్‌ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 11:37 AM