Woman: ఇన్‌స్టాలో యువతి పరిచయం.. నమ్మించి ఫుడ్‌లో మత్తు మంది కలిపి ఇద్దరి అత్యాచారం
ABN , Publish Date - Feb 02 , 2024 | 07:52 PM
ఇటివల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు నేరాలు కూడా చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. సోషల్‌మీడియాలో ఫ్రెండ్‌షిప్, చాటింగ్, డేటింగ్ పేరుతో ఇటివల కాలంలో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో ఇన్‌స్టాలో పరిచయమైన యువతిపై ఇద్దరు పరిచయస్తులు నమ్మించి అత్యాచారం చేశారు.
ఇటివల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు నేరాలు కూడా చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. సోషల్‌మీడియాలో ఫ్రెండ్‌షిప్, చాటింగ్, డేటింగ్ పేరుతో ఇటివల కాలంలో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో ఇన్‌స్టాలో పరిచయమైన యువతిపై ఇద్దరు పరిచయస్తులు నమ్మించి అత్యాచారం చేశారు. ఆ 18 ఏళ్ల యువతికి స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమెకు ఆహారంలో మత్తు మందు కలిపి తినిపించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Bharat Rice: రూ.29కే కిలో రైస్.. ఎప్పుడు? ఎక్కడ ఇస్తారు? వివరాలివే..
అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం నమోదైన కేసు ఆధారంగా నిందితులిద్దరినీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 29న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మదంగిర్‌లోని ఓ కూడలి వద్ద నిందితులు తనను పిలిచారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. వారు స్కూటర్‌పై కూర్చోమని కోరారని బాలిక తెలిపింది.
అందుకు ఆమె నిరాకరించడంతో నిందితులు ఆమెను వారితో బలవంతంగా తీసుకెళ్లినట్లు చెప్పింది. ఆ తర్వాత నిందితులిద్దరూ బాధితురాలిని మాలవీయ నగర్‌కు తీసుకెళ్లి అక్కడ భోజనం చేశారు. నిందితులు ఆహారంలో ఆమెకు మత్తు పదార్థాలు కలిపారని, తిన్న తర్వాత తనకు కళ్లు తిరగడం మొదలైందని యువతి పేర్కొంది.
బాలిక స్పృహలోకి రాగానే లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందని బాధితురాలు ఫిర్యాదులో వెల్లడించింది. ఈ క్రమంలో భారతీయ శిక్షాస్మృతిలోని 376 డీ, 506 (నేరపూరిత బెదిరింపు), 34 (సాధారణ ఉద్దేశ్యం) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి 19, 21 ఏళ్ల వయస్సు గల నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి క్రమంలో యువతీ యువకులు ఎవరినీ కూడా సోషల్ మీడియాలో గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.