Share News

Krishnashtami Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Aug 26 , 2024 | 09:29 AM

తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శ్రీ కృష్ణుడి ఆలయాల ముందు భక్తుల రద్దీ నెలకొంది.

Krishnashtami Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శ్రీ కృష్ణుడి ఆలయాల ముందు భక్తుల రద్దీ నెలకొంది. హైదరాబాద్‌లో ప్రముఖ ఇస్కాన్ టెంపుల్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, శ్రీ రాధాకృష్ణ దేవాలయం తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చిన్ని కృష్ణయ్యకు ప్రీతిపాత్రమైన పాలు, నెయ్యి, వెన్నె తదితర ఆహారపదార్థాలను నైవేథ్యం సమర్పించడానికి క్యూ కట్టారు.

తెలంగాణ, ఏపీలోని అన్ని జిల్లాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లలకు కృష్ణుడి వేషం వేస్తున్నారు. అనంతరం వారి ఫొటోలను తమ కెమెరాల్లో బంధించి వాట్సప్ స్టేటస్‌లుగా పెడుతూ మురిసిపోతున్నారు.


మధురలో భద్రత కట్టుదిట్టం..

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణుడి జన్మస్థలమైన మధురలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. మధురకు భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

For Latest News click here

Updated Date - Aug 26 , 2024 | 09:29 AM