Share News

BRAOU: అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ప్రవేశాలు

ABN , Publish Date - Oct 05 , 2024 | 08:05 AM

హైదరాబాద్‌లోని డా. బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)- గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టడీసెంటర్లు అందుబాటులో ఉన్నాయి.

BRAOU: అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని డా. బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)- గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టడీసెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. ప్రోగ్రామ్‌లలో భాగంగా కాంటాక్ట్‌ తరగతులు, ల్యాబొరేటరీ సెషన్స్‌, అసైన్‌మెంట్స్‌, వార్షిక పరీక్షలు ఉంటాయి. ఆలిండియా రేడియో ద్వారా నిర్ణీత సమయాల్లో రేడియో పాఠాలు ప్రసారం చేస్తారు. డిగ్రీ ప్రోగ్రామ్‌లలో రెండు, మూడు సంవత్సరాలు; పీజీలో రెండో సంవత్సరం చదువుతున్నవారు; ఓల్డ్‌ బ్యాచ్‌ స్టూడెంట్స్‌ కూడా తమ ట్యూషన్‌ ఫీజులు చెల్లించవచ్చు.


అర్హత:

బీఏ, బీకాం కోర్సులకు ఏదేని గ్రూపుతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీలో ప్రవేశానికి ఇంటర్‌(సైన్స్‌) గ్రూపు అభ్యర్థులు అర్హులు. పీజీ కోర్సులకు ద్వితీయ శ్రేణి మార్కులతో సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లాంగ్వేజెస్‌లో ఎంఏ కోర్సుకు డిగ్రీలో సంబంధిత లాంగ్వేజ్‌ని సెకండ్‌ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. ఎంకాం కోర్సుకు బీబీఏ/బీబీఎం/బీఏ(కామర్స్‌) అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ(మేథమెటిక్స్‌/అప్లయిడ్‌ మేథమెటిక్స్‌)కోర్సుకు మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎమ్మెస్సీ సైకాలజీకి ఏదేని డిగ్రీ పాసైతే చాలు.

మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌(ఎంఎల్‌ఐఎస్సీ) కోర్సు వ్యవధి ఏడాది. ఇంగ్లీష్‌ మాధ్యమంలో మాత్రమే ఈ కోర్సు ఉంది. కనీసం 40 శాతం మార్కులతో బీఎల్‌ఐఎస్సీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 15

వెబ్‌సైట్‌: www.braou.ac.in

Updated Date - Oct 05 , 2024 | 08:05 AM