Software Training: గుడ్ న్యూస్.. 80 శాతం డిస్కౌంట్‌తో సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ..
ABN , Publish Date - Oct 04 , 2024 | 03:58 PM
National Skill Academy: నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో డేటా సైన్స్, బిగ్ డేటా, ఏఐ సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఎస్ఏ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ శిక్షన మొత్తం ఆన్‌లైన్ విధానంలో ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 04: నేషనల్ స్కిల్ అకాడమీ (National Skill Academy) ఆధ్వర్యంలో డేటా సైన్స్, బిగ్ డేటా, ఏఐ సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఎస్ఏ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ శిక్షన మొత్తం ఆన్‌లైన్ విధానంలో ఉంటుందని తెలిపారు. ఇవి మాత్రమే కాదు.. మరికొన్ని కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నామని.. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
ఎవరు అప్లై చేసుకోవచ్చు..
ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటనలో తెలిపారు.
ఏయే కోర్సుల్లో శిక్షణ ఇస్తారు..
సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషీన్ లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బ్లాక్ చెయిన్, డీప్ లెర్నింగ్, సెలీనియం, సేల్స్ ఫోర్స్, జావా, ఒరాకిల్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ డిజైన్ మొదలైన కోర్సులలో అర్హతను బట్టి ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు.
ఫీజు ఎంత ఉంటుంది..
ఈ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు, దివ్యాంగులు, మాజీ సైనికులు, వారి పిల్లలకు స్వర్ణ భారత్ జాతీయస్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 80% మేర ఫీజు రాయితీ ఉంటుందని నోటిఫికేషన్‌లో వివరించారు. ఈ కోర్సులపై ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9505800050, 9505800047 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
Also Read:
Hard Work: డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు.. అది నిజమే కదా..
Good news: త్వరపడండి.. బెల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్..
RRB Recruitment: ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, ఫీజు వివరాలివే
For More Education News and Telugu News..