Patancheru: ‘గీతం’ పూర్వ విద్యార్థికి అరుదైన గౌరవం..
ABN , Publish Date - Dec 13 , 2024 | 10:04 AM
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ(Geetam School of Technology) పూర్వ విద్యార్థి, ప్రస్తుతం అమెజాన్ రోబోటిక్స్‌లో సిస్టమ్స్ డెవలప్ మెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనూజ్ సురావ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు అమెరికా, కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ పరిశోధనా సదస్సు (గ్లోబల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ 2024లో వక్తగా, న్యాయనిర్ణేతగా)లో పాల్గొన్నారు.
- ప్రపంచ సదస్సులో వక్తగా, న్యాయనిర్ణేతగా అవకాశం
- గ్లోబల్ ఐకాన్ అవార్డుతో సత్కారం
పటాన్‌చెరు(సంగారెడ్డి): గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ(Geetam School of Technology) పూర్వ విద్యార్థి, ప్రస్తుతం అమెజాన్ రోబోటిక్స్‌లో సిస్టమ్స్ డెవలప్ మెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనూజ్ సురావ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు అమెరికా, కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ పరిశోధనా సదస్సు (గ్లోబల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ 2024లో వక్తగా, న్యాయనిర్ణేతగా)లో పాల్గొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Manda krishna Madiga: లక్ష డప్పులు.. వెయ్యి గొంతులతో దండోరా ప్రదర్శన
బెంగళూరుకు చెందిన గ్లోబల్ ఎకనామిక్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ హరికృష్ణ మారం నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రోబోటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథ రంగాలకు అనూజ్ చేసిన సేవలను గుర్తిస్తూ ‘గ్లోబల్ ఐకాన్ అవార్డు’తో సత్కరించారు. అమెరికా అంకుర సంస్థల నిపుణుడు, వక్త, మార్గదర్శి, వ్యవస్థాపకుడు బారన్ అలెక్ స్టెరన్ చేతుల మీదుగా ఈసత్కారాన్ని అందుకోవడం విశేషం. ‘అడాప్టివ్ ఇంటర్ ఫేస్‌తో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, కృత్రిమ మేథ ఆధారిత ఆటోమేటెడ్ రోబోటిక్ సిస్టమ్’ఫై అనూజ్ సంచలనాత్మక పరిశోధనా పత్రం సమర్పించారు.
తన పరిశోధనాంశాలను అక్కడ ప్రదర్శించడం, వినూత్న పరిశోధనా పత్రాల ఎంపికలో న్యాయనిర్ణేతగా వ్యవహరించా రు. అత్యాధునిక కృత్రిమ మేథస్సు, అడాప్టివ్ ఇంటర్ ఫేస్‌ల ఏకీకరణను ప్రస్ఫుటించేలా అనూజ్ అధునాతన రోబోటిక్ సిస్టమ్‌ను చూసేందుకు సదస్సుకు హాజరైన వారికి వీలుకల్పించారు.
సంకల్ప్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సామాజిక సేవ, అనాథలను ఆదుకోవడంతో పాటు గీతం విద్యార్థిగా ప్రఖ్యాత ఐటీసీ సంస్థ నుంచి పర్యావరణ పరిరక్షణకు గాను నేషనల్ గ్రీన్ లీడర్ అవార్డును అనూజ్ అందుకున్నారు. తర్వాత న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేసి, అమెరికాలోనే స్థిరపడ్డారు. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గుర్తింపు తెచ్చుకున్న అనూజ్ గీతంలోని ఉన్నత విద్య, విలువల నాణ్యతకు నిదర్శనంగా నిలిచారు.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News