AP Elections: జగన్ సర్కార్‌కు వరుస షాక్‌లు.. సారొచ్చేశారు!
ABN , Publish Date - Apr 20 , 2024 | 05:26 PM
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ (Jagan) సర్కార్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిని విధుల నుంచి తప్పించింది. ఎన్నికల వేళ మద్యం అక్రమ తరలింపు ఆరోపణల నేపథ్యంలో బదిలీ చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా 2016 బ్యాచ్ ఐఎఎస్ అధికారి చేతన్‌ను నియమించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ (Jagan) సర్కార్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైసీపీకి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ (TDP) ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. తర్వాత ఏపీ ప్రభుత్వ సలహాదారులకు షాక్ ఇచ్చింది. సలహాదారులు నిర్దేశించిన విధులు కాకుండా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం, ఆ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల విధుల్లో సలహాదారులు కలుగజేసుకోవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తాజాగా బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిని విధుల నుంచి తప్పించింది. ఎన్నికల వేళ మద్యం అక్రమ తరలింపు ఆరోపణల నేపథ్యంలో బదిలీ చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా 2016 బ్యాచ్ ఐఎఎస్ అధికారి చేతన్‌ను నియమించింది.
Atchannaidu: గులకరాయి డ్రామాకు దర్శకత్వం వహించినవారికి తగిన రీతిలో సన్మానం... అచ్చెన్న వార్నింగ్
ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ గతంలో కంటే నాలుగు రెట్ల మద్యం అమ్మకాలు పెరిగాయి. ఈ సారి ఎలాగైనా గెలవాలని వైసీపీ చూస్తోంది. గోడౌన్ల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తోంది. అధికార వైసీపీ నేతలకు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి సహకారం అందించారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇటీవల చింతలపూడి వద్ద మద్యం సీసాలతో ఉన్న లారీ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాయి. దాంతో వాసుదేవ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికలకు సంబంధం లేని పోస్టింగ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. దాంతో వాసుదేవ రెడ్డిని బదిలీ చేసి.. ఆ స్థానంలో చేతన్‌ను నియమించారు.
AP Election 2024: గన్నవరంలో హీటెక్కిన రాజకీయం.. చర్చకు దారి తీసిన నామినేషన్
అధికారుల బదిలీ
రాష్ట్రంలో గల డిస్టిలరీలో మద్యం తయారవుతోంది. అక్కడి నుంచి మద్యం గోడౌన్లకు చేరుతుంది. ఇదివరకు గోడౌన్ల నుంచి నేరుగా వైసీపీ నేతలు తీసుకెళ్లే వారు. డిస్టిలరీలో తయారయ్యే మద్యం, గోడౌన్‌కు వెళ్లే సమయంలో సీసీ కెమెరా అమర్చాలని.. లారీలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఎఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి
మరిన్ని ఏపీ వార్తల కోసం