Share News

ABN Big Debate Live: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరతో ఏబీఎన్ ఎండీ ఆర్కే ‘బిగ్ డిబేట్’ లైవ్..

ABN , First Publish Date - Apr 24 , 2024 | 07:02 PM

‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేటి (బుధవారం) ‘బిగ్ డిబేట్’ చర్చలో గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్కే గారూ సంధిస్తున్న ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నారు. ఈ చర్చా కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించండి.

ABN Big Debate Live: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరతో ఏబీఎన్ ఎండీ ఆర్కే ‘బిగ్ డిబేట్’ లైవ్..

Live News & Update

  • 2024-04-24T20:02:44+05:30

    Big-Debate.jpg

    పెమ్మసాని చంద్రశేఖర్

    • నా భార్య నా కంటే ఎక్కువ సమాజసేవ చేస్తుంది

    • అబద్ధాలు చెప్పి క్యారక్టర్ అమ్ముకోను

    • ఇప్పుడున్న యువత నిజాలను కోరుకుంటున్నారు

    • రాష్ట్రానికి సీఎం జగన్ ఏం చేశారు?

  • 2024-04-24T19:55:41+05:30

    పెమ్మసాని చంద్రశేఖర్..

    • చంద్రబాబు వేరే పని లేకుండా ప్రజల కోసమే పని చేస్తారు. 24 గంటలూ ప్రజల గురించే ఆలోచిస్తారు. చంద్రబాబు ఎంత డైనమిక్‌గా పని చేస్తారో చూశాను. తెలుగుజాతి ఎదుగుదలలో చంద్రబాబు పాత్ర చాలా ఉంది. చంద్రబాబుకు చాలా ఓర్పు, సహనం ఉంది.

    • నేను ఆశావాదిని ప్రతికూలంగా ఆలోచించను. పది మందికి ఉపయోగపడే పని చేస్తాను. వ్యక్తిగత ఎవరికీ డబ్బు ఇవ్వను. ఇవ్వనని ముక్కుసూటిగా చెబుతాను.

  • 2024-04-24T19:43:00+05:30

    Untitled-5.jpg

    • సీఎం జగన్‌ ఏం చేశారు?

    • 2004లో జగన్‌ ఆస్తి కోటి రూపాయలు.

    • జగన్‌ క్విడ్‌ప్రోకోలో కోట్లు సంపాదించారు

    • కష్టపడి పైకొట్టిన వాళ్లతో జగన్‌ను పోల్చవద్దు

  • 2024-04-24T19:42:24+05:30

    పెమ్మసాని: చంద్రబాబు గారిని నేను కాలేజీ రోజుల నుంచి చూస్తూ ఎదిగాను. ఆయన పోరాటాలు చూశాను. తెలుగుజాతి వారు ఎక్కడ తిరుగుతున్నా అందులో చంద్రబాబు గారి పాత్ర ఉంది. ఆ విషయంలో ఆయనను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను.

  • 2024-04-24T19:27:49+05:30

    పెమ్మసాని: నా టాలెంట్‌తో ఎదిగాను. 30 ఏళ్ల తర్వాత ఈ స్టేజ్‌కు వచ్చా. 40 శాతం ట్యాక్స్‌ కడితే ఈ స్టేజ్‌కు వచ్చాను.

  • 2024-04-24T19:24:45+05:30

    • రాజకీయాలు ఎలా ఉంటాయో ముందే తెలుసు

    • నాకు ఈ గడ్డపై ప్రేమ ఉంది: పెమ్మసాని

    • ఏపీలో పరిస్థితులు చూసి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా

    • టీడీపీని, అనేక వర్గాల్ని టార్గెట్‌ చేశారు

    • జనం డబ్బుతో అమెరికా వెళ్లి చదివా

  • 2024-04-24T19:19:16+05:30

    Untitled-4.jpg

    పెమ్మసాని: పాతికేళ్లపాటు అమెరికాలో సేవ చేశాను. రాజకీయాల్లోకి రావాలని బలంగా నిర్ణయించుకున్నాను. ఒకవేళ నా మీద కేసులు పెట్టినా ఎన్ని పెడతారు?. జైలుకు వెళ్తే పుస్తకాలు రాసుకుంటాను. నన్ను ఎవడైనా కొడితే వాడి చెయ్యి తీస్తా. రాజకీయాల్లోకి వెళ్లొద్దని చాలా మంది చెప్పారు. డబ్బుతో రాజకీయాలు చేయాలనుకోవడం పిచ్చితనం.

  • 2024-04-24T19:15:27+05:30

    పెమ్మసాని: రాజకీయాల్ని బురద అనుకోవడం లేదు. ఇంట్లో వాళ్లు ఎందుకు ఇవన్ని అన్నారు. కానీ ఇష్టంతో, బాధ్యతతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను.

  • 2024-04-24T19:12:49+05:30

    పెమ్మసాని: కర్మ సిద్ధంతాన్ని నమ్ముతాను. మంచి చేస్తే మంచి వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది.

  • 2024-04-24T19:11:01+05:30

    పెమ్మసాని: అమెరికాలో చాలా కాలం ఉన్నప్పటికీ భారత్ మీద ప్రేమతో నా పాస్ పోర్ట్ తీసుకోలేదు. నేను భారత్ పాస్‌పోర్టునే ఉంచుకున్నాను. 15 ఏళ్ల క్రితమే అమెరికా పాస్‌పోర్ట్ వచ్చేది. ఎప్పటికీ భారత్ పాస్‌పోర్టునే ఉంచుకుంటాను.

  • 2024-04-24T19:09:31+05:30

    పెమ్మసాని: అన్నింటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. జైలుకు కూడా వెళ్లడానికి సిద్దమే. ఏమీ లేకపోయినా చట్టాలకు విరుద్ధంగా నా మీద అన్యాయంగా కేసులు పెడితే నాకు టైమ్ వచ్చినప్పుడు చేయాల్సింది చేస్తా. చెయ్యి తీసేయడానికైనా వెనుకాడను. ప్రతి ఒక్కరికీ టైమ్ వస్తుంది.

    Untitled-3.jpg

  • 2024-04-24T19:05:09+05:30

    పెమ్మసాని చంద్రశేఖర్: సేవ చేయాలన్న ఆశ ఉంది. అందుకే ఇక్కడ పోటీ చేస్తున్నాను. గల్లా జయదేవ్ లాంటి వాళ్లను ఇబ్బంది పెట్టారు. నాకు ఇక్కడ ఎలాంటి వ్యాపారాలు.

  • 2024-04-24T18:59:57+05:30

    తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో అతిథితో తెలుగు ప్రజల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నేపథ్యంలో రాజకీయ నేతలను ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేటి (బుధవారం) ‘బిగ్ డిబేట్’ చర్చలో గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్కే గారూ సంధిస్తున్న ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నారు. ఈ చర్చా కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించండి.