Home » Pemmasani Chandrasekhar
లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం ప్రవేశపెట్టరు. ఈ బిల్లును విపక్షాలకు చెందిన సభ్యులు వ్యతిరేకించారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ టీడీపీ మద్దతు తెలిపింది.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ హబ్‌గా ఏపీని తయారు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే గూగూల్‌తో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. వీవీఐటీలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు.
ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేల మంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు.
అమెరికాలోని గ్రాండ్ క్యాన్యన్ తరహాలో గండికోటను అభివృద్థి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు.
రబీ సీజన్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులకు కేంద్రం ఇవ్వడానికి సమ్మతి తెలిపిన విలువ రూ.60 వేల కోట్లు. నమ్మశక్యం కానన్ని నిధులు కేంద్రం నుంచి సాధించగలిగాం. వంద రోజుల్లో ఇన్ని నిధులకు సమ్మతి తెచ్చుకోవడం ఒక అద్భుతం’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయ పడ్డారు.
సమాజం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కష్టపడే తత్వం, మంచి బుద్ది, జ్ఞానం, సరిపడినంత ధనం, ధైర్యం కలిగిన తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అవసరమైన సాయం చేయకుంటే సమాజం బాగుపడదనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన వివరించారు.
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందించేందుకు కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. వ