Share News

Vote: ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ మీ చేతికి ఇస్తారా..? ఇందులో నిజమెంత..?

ABN , Publish Date - May 12 , 2024 | 12:20 PM

రూ.10 ఇస్తే వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓటు వేసిన తర్వాత ఎన్నికల అధికారి సదరు ఓటరు వీవీ ప్యాట్ స్లిప్ ఇవ్వమని అడుగుతారు. అందుకోసం రూ.10 చెల్లిస్తే చాలు స్లిప్ ఇస్తారని తెలిసింది.

Vote: ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ మీ చేతికి ఇస్తారా..? ఇందులో నిజమెంత..?
vvpat

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల సంరంభం ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీకి కూడా పోలింగ్ జరగనుంది. ఈవీఎంతోపాటు వీవీ ప్యాట్ (vvpat slip) పక్కన ఉంటాయి. ఓటరు ఓటు వేసింది ఏ అభ్యర్థికి అనే అంశం చూసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం 2018లో కల్పించింది. అప్పటి నుంచి వీవీ ప్యాట్‌లు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఓటుపై సందేహాలు ఉంటే వీవీప్యాట్ స్క్రీన్ మీద ఓటరు తన ఓటును పరిశీలించుకోవచ్చు. 7 సెకన్ల పాటు మాత్రమే ఎవరికి ఓటు వేశామనేది స్ర్కీన్ మీద కనిపిస్తోంది.


వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తారా..?

పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం, వీవీ ప్యాట్ పక్క పక్కనే ఉంటాయి. ఓటు వేసిన తర్వాత ఏ గుర్తుకు వేశామే వీవీ ప్యాట్ మీద ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తోంది. తర్వాత మిషన్ కింద భాగంలో ఉన్న బాక్స్‌లో స్లిప్ పడిపోతుంది. తర్వాత పోలింగ్ అధికారి వద్ద ఉండే కంట్రోల్ యూనిట్‌కు చేరుతుంది. ఓటుపై సందేహాం కలిగితే వీవీప్యాట్‌లో నమోదైన కాగితాల ఆధారంగా పరిశీలిస్తారు..? ఇప్పుడు ఆ వీవీ ప్యాట్ స్లిప్ ఓటరుకు ఇస్తారని తెలుస్తోంది. రూ.10 కడితే చాలు మీకు వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తారని సమాచారం.


ఎవరికీ ఓటు వేసింది తెలుస్తోంది..?

పోలింగ్ కేంద్రంలో ఉండే ఎన్నికల అధికారి లేదంటే ప్రిసైడింగ్ అధికారికి రూ.10 కడితే చాలు వీవీ ప్యాట్ స్లిప్ అందజేస్తారని తెలుస్తోంది. నిజానికి అలా సర్క్యులేట్ అవుతోన్న వార్త ఫేక్. వీవీ ప్యాట్ స్లిప్‌ను ఎన్నికల అధికారులు అందజేయరు. ఓటు వేసిన తర్వాత మిషన్‌లో స్లిప్ పడిపోతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలో వచ్చిన ఓట్లు, వీవీప్యాట్లలో నిక్షిప్తమైన ఓట్లను లెక్క చూస్తారు. తేడా వస్తే ఏం జరిగిందని ఆరా తీస్తారు. అంతే తప్ప.. ఓటరు వేసిన ఓటు స్లిప్‌ను వీవీ ప్యాట్ నుంచి తీసి ఇవ్వరు.


ఇవి కూడా చదవండి..

Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?

Hyderabad: ఓట్ల పండుగేమో కానీ.. అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్.. బండి కదిలితే ఒట్టు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2024 | 12:20 PM