Share News

Health Tips: రోజూ ఈ 5 వ్యాయామాలు చేస్తే క్యాన్సర్ ముప్పు 50 శాతం తగ్గుతుంది..

ABN , Publish Date - Nov 04 , 2024 | 01:57 PM

Exercises for Reduce Cancer Risk: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. చాలా మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే తమ జీవనశైలిని మెరుగుపరుచుకోవడమే ఉత్తమమైన మార్గం.

Health Tips: రోజూ ఈ 5 వ్యాయామాలు చేస్తే క్యాన్సర్ ముప్పు 50 శాతం తగ్గుతుంది..
Exercise for Health

Exercises for Reduce Cancer Risk: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. చాలా మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే తమ జీవనశైలిని మెరుగుపరుచుకోవడమే ఉత్తమమైన మార్గం. నిత్యం వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో రుజువైంది. ముఖ్యంగా 5 రకాల వ్యాయామాలు క్యాన్సర్ ప్రమాదాన్ని 50 శాతం తగ్గించడంలో సహాయపడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ 5 వ్యాయామాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఎరోబిక్స్..

చురుకైన నడక, జాగింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. దీంతోపాటు ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే వారానికి కనీసం 150 నిమిషాలు ఏరోబిక్స్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


సైక్లింగ్..

సైక్లింగ్.. మన ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా మెరుగుపరుస్తుంది. కాళ్ళ కండరాలను బలపరుస్తుంది. శారీరక శక్తిని పెంచుతుంది. సైక్లింగ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఒక నివేదిక ప్రకారం.. సైక్లింగ్ క్రమం తప్పకుండా చేయడం వల్ల క్యాన్సర్ ముప్పు 45 శాతం తగ్గుతుంది.


వెయిట్ లిఫ్టింగ్..

వెయిట్ లిఫ్టింగ్ కండరాలను బలపరుస్తుంది. శరీరంలోని హార్మోన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారానికి 2-3 రోజులు వెయిట్ లిఫ్టింగ్ చేయడం ద్వారా సానుకూల ప్రభావం శరీరంపై కనిపిస్తుంది.

యోగా..

యోగా శరీరం, మనస్సు రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో ప్రతిరోజూ సూర్య నమస్కారం, ప్రాణాయామం సాధన చేయవచ్చు.


స్ట్రెచ్చింగ్..

స్ట్రెచింగ్ వ్యాయామాల వల్ల కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారుతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు కొన్ని నిమిషాలు స్ట్రెచింగ్ వ్యాయామం చేయాలి. చేతులు, కాళ్లను సాగదీయడం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

గమనిక: ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైద్య నిపుణులు అందించిన, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ వార్తను పబ్లిష్ చేయడం. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. తప్పకుండా తొలి ప్రాధాన్యతగా వైద్యులను సంప్రదించి, వారి సలహాలు పాటించాలి.


Also Read:

అంబటిపై శ్రీవారి భక్తుల ఆగ్రహం.. ఎందుకంటే

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్

ఏపీ ప్రజలకు బిగ్ షాక్..

For More Health News and Telugu News..

Updated Date - Nov 04 , 2024 | 01:57 PM