Share News

Health News: చలికాలంలో ఈ ఆకుకూరలు తింటే ఇక అంతే సంగతులు..

ABN , Publish Date - Nov 26 , 2024 | 07:22 AM

సాధారణంగా ఆకుకూరల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. జీర్ణాశయ సమస్యలను ఇది మరింత పెంచుతుంది. ముఖ్యంగా గర్భిణులు, అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో ఆకుకూరలు తినకపోవడమే ఉత్తమం.

Health News: చలికాలంలో ఈ ఆకుకూరలు తింటే ఇక అంతే సంగతులు..

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతుంటారు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిత్యం మంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. వీటిలో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వైద్యులు సైతం వీటిని తరచూ తినాలని చెబుతుంటారు. అయితే ఇప్పుడు వీటి గురించి ఎందుకు అనుకుంటున్నారా?.. అక్కడే ఉంది విషయం. ఆకుకూరలు ఎంత ఆరోగ్యకరమైనప్పటికీ.. కొన్ని రకాల ఆకుకూరలు శీతాకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తామని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వాటికి ఈ కాలంలో దూరంగా ఉండాలని హెచ్చరిస్తు్న్నారు. ఆ ఆకుకూరలు ఏంటి, వాటి వల్ల కలిగే అనర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇవి అస్సలు తినొద్దు..

  • పాలకూరను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే చలికాలంలో ఇది ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. పాలకూర అనేది మూత్రంలో కాల్షియం విసర్జనను పెంచుతుంది. అందువల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • బచ్చలికూరను చలికాలంలో ఎక్కువగా తింటే జీర్ణాశయానికి సంబంధించిన పలు సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బచ్చలికూరలో ఉండే ఫైబర్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. సాధారణంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు శీతాకాలంలో బచ్చలికూర జోలికి పోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

  • సాధారణంగా ఆకుకూరల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. జీర్ణాశయ సమస్యలను ఇది మరింత పెంచుతుంది. ముఖ్యంగా గర్భిణులు, అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో ఆకుకూరలు తినకపోవడమే ఉత్తమం. ఆకుకూరల్లో ఆక్సలేట్స్ సమ్మేళనం ఉంటుంది. అయితే కీళ్ల నొప్పులు అధికమవ్వడానికి ఈ సమ్మేళనం కారణం అవుతుంది. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు చలికాలంలో ఆకుకూరలు తినకపోవడమే మంచిది.

  • అలాగే కాలే ఆకుకూరలో ఆక్సలేట్ అనేది మెండుగా ఉంటుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆకుకూరలు తినకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

  • ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కొన్ని రకాల ఆకుకూరలు ప్రయోజనానికి బదులుగా హాని చేసే ప్రమాదం నిపుణులు చెబుతున్నారు. అయితే ఆకుకూరలు తినాలని భావించే వారు తమ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకునే ఏవి తింటే మంచిదో వైద్యులను సంప్రదించడం ఉత్తమమని నిపుణలు చెబుతున్నారు.

Updated Date - Nov 26 , 2024 | 07:22 AM