Health News: మద్యంలో సోడా కలుపుకుని తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
ABN , Publish Date - Aug 10 , 2024 | 07:07 AM
మద్యం తాగే వారికి దేశంలో కొదవే లేదు. రోడ్లపై ఎక్కడా చూసిన మద్యం ప్రియులు కనిపిస్తుంటాయి. దాన్ని తాగటం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని తెలిసినా క్యూలో నిలబడి మరీ పెద్ద యుద్ధం చేసి వాటిని సాధిస్తారు. వీకెండ్‌లో తాగే వారు కొంతమంది అయితే రోజూ తాగే వారు మరికొంతమంది.
మద్యం తాగే వారికి దేశంలో కొదవే లేదు. రోడ్లపై ఎక్కడా చూసిన మద్యం ప్రియులు కనిపిస్తుంటాయి. దాన్ని తాగటం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని తెలిసినా క్యూలో నిలబడి మరీ పెద్ద యుద్ధం చేసి వాటిని సాధిస్తారు. వీకెండ్‌లో తాగే వారు కొంతమంది అయితే రోజూ తాగే వారు మరికొంతమంది. అయితే ఇప్పుడు వీరి గురించి ఎందుకు అనుకుంటున్నారా?. అక్కడే ఉంది విషయం. చాలా మంది మద్యం తాగే సమయంలో మంచినీరు, కూల్ డ్రింక్స్ లేదా సోడా కలుపుకుని తాగుతుంటారు. అయితే సోడా కలుపుకుని తాగడం వల్ల మద్యం ప్రియులకు సాధారణంగా వచ్చే అనారోగ్యాలతోపాటు మరికొని ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
మద్యం, సోడా రెండూ మిక్స్ చేస్తే డేంజర్..
మద్యం, సోడా రెండూ మిక్స్ చేసి తాగడం వల్ల మూత్రపిండాలపై ప్రభావం ఉంటుంది. కిడ్నీలపై ఒత్తిడిని పెరిగి దీర్ఘకాలంలో అనేక వ్యాధులకు దారి తీయవచ్చు. అలాగే కాలేయంపై ఒత్తిడి పెరిగి దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా జరిగితే మనం చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెదడుకు నష్టం కలుగుతుంది. రెండూ కలిపి అధిక మొత్తంలో తాగే వారికి మెదడు కణాలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అలాగే మెదడుకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి. సోడాలోని ఆమ్లాలు, కార్బొనేషన్ జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దీని వల్ల ఆమ్లత్వం, అల్సర్స్, అజీర్తి, గ్యాస్ వంటి పలు రకాల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.
అలాగే రెగ్యులర్‌గా మద్యం పీపాలు పీపాలు లాగిస్తే అది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సోడాలో ఉండే సోడియం రక్తపోటును పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల దీర్ఘకాలంలో గుండెకు సంబంధించిన పలు రకాల సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా ఆల్కహాల్‌లో సోడా కలిపి తాగితే కాలేయం దెబ్బతింటుంది. మరో విషయం ఏంటంటే.. సోడాలోని ఫాస్ఫోరిక్ ఆమ్లం మానవ శరీరంలోని కాల్షియంను తగ్గిస్తుంది. దీని వల్ల ఎముకలు బలహీనపడతాయి. దీంతో చిన్నచిన్న ప్రమాదాలకే త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంది.