Health: కళ్లకు కంప్యూటర్ కష్టాలు.. అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు..
ABN , Publish Date - Apr 13 , 2024 | 08:47 PM
కాలం మారింది. లైఫ్ స్టైల్( Life Style ) లోనూ మార్పులు వచ్చేశాయి. కూర్చుని పని చేసే విధానానికి అలవాటు పడిపోయారు. పెరుగుతున్న సాంకేతికతతో క్షణంలో అవసరాలు తీరిపోతున్నాయి. దీంతో తెరపై పని చేసే పద్ధతి విపరీతంగా పెరిగిపోయింది.
కాలం మారింది. లైఫ్ స్టైల్( Life Style ) లోనూ మార్పులు వచ్చేశాయి. కూర్చుని పని చేసే విధానానికి అలవాటు పడిపోయారు. పెరుగుతున్న సాంకేతికతతో క్షణంలో అవసరాలు తీరిపోతున్నాయి. దీంతో తెరపై పని చేసే పద్ధతి విపరీతంగా పెరిగిపోయింది. కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ కూర్చుని పని చేసే స్థాయికి వచ్చేశాం. దీంతో జీవన చక్రం గాడి తప్పింది. నిద్రాహారాలు మాని పని చేస్తుండటం వల్ల అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మరీ ముఖ్యంగా కంప్యూటర్, మొబైల్, టీవీ ఎక్కువగా చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి కలుగుతుంది. ఇది కంటి నొప్పిని పెంచుతుంది. కాబట్టి నేటి టెక్ యుగంలో చాలా మంది కళ్లజోడు ధరించడం సాధారణ విషయంగా మారిపోయింది. కానీ లోతుగా విశ్లేషిస్తే మాత్రం నమ్మలేని నిజాలు మనకు దిగ్భ్రాంతి కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
Harish Rao: రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా.. హరీశ్ రావు ఫైర్..
తెర ముందు అధిక సమయం పని చేయడం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి. వాపు, కంటి నుంచి నీరు కారడం, కళ్లు మసకబారడం వంటి లక్షణాలు తలెత్తుతాయి. వీటిని తొందరగా గుర్తించి అవసరమైన చికిత్స అందించాలి. లేకుంటే తీవ్ర అనర్థాలకు దారి తీస్తాయి. కంటికి సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తితే ఆలస్యం చేయకుండా వెంటనే కంటి వైద్యుడ్ని కలవాలి. ఎలాంటి సందేహం లేకుండా సమస్యను క్షుణ్నంగా వివరించాలి. అవసరమైతే అద్దాలు తీసుకోవాలి. అవి మీ కంప్యూటర్ స్క్రీన్‌ను చూసేందుకు అనువుగా ఉన్నాయో లేవో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
Elections 2024: జగన్ అంటే అబద్దం...చంద్రబాబు అంటే నిజం.. టీడీపీ
కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు పోషకాహారాన్ని తీసుకోవాలి. బచ్చలికూర, సాల్మన్, ట్యూనా, గుడ్లు, గింజలు, బీన్స్, క్యారెట్, పాలకూర వంటి ఆహారాన్ని డైట్ లో భాగం చేసుకోవాలి. పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. ధూమపానం వల్ల కంటి చూపు మందగిస్తుంది. దృష్టి మసకబారుతుంది. ఆఫీస్ లో సౌకర్యవంతంగా ఉండే కుర్చీని ఎంచుకోవాలి. ప్రతి 20 నిమిషాలకు మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. లేదా ప్రతి 2 గంటలకు 15 నిమిషాలు విరామం తీసుకోవాలి. ఈ సలహాలు పాటిస్తే కళ్లకు కలకాలం సురక్షితంగా ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏమైనా అనుమానాలుంటే కంటి వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని ఆరోగ్యం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..